విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం సిఐటియు అంగన్వాడి యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సమస్యల పరిష్కారానికి జూలై 10,11 న కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో 36 గంటల ధర్నా చేపట్టడం జరుగుతుందని పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించేంతవరకు ఉద్యమ ఉధృతం చేస్తామని నాయకులు అన్నారు.