London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బిజెపి వైఫల్యం

మత విభజనతో మరోసారి గెలవడానికి కుట్రలు

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర-ఉరవకొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గడచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయిందని, అంతేకాకుండా నిరుద్యోగ సమస్య, పెరిగిన ధరలను తగ్గించడంలో, నల్లధనం వెలికి తీయడంలో కూడా వైఫల్యం చెందిందని 2024 సార్వత్రిక ఎన్నికలలో గెలవడానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేకపోవడంతో మరోసారి అధికారం కోసం మత విభజన పేరుతో ఉమ్మడి పౌరసత్వం( యూనిఫామ్ సివిల్ కోడ్ ) తీసుకురావడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తుందని సిపిఐ పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి సి.జాఫర్ అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నో మతాలు, విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం నెలకొన్న దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి,ఆర్ఎస్ఎస్ సంస్థలు ఇతర మతాల యొక్క ఆచార వ్యవహారాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం తగదన్నారు. స్వయంగా ప్రధాని మోడీ జూన్ 27వ తేదీన మధ్యప్రదేశ్లో ఉమ్మడి పౌరసత్వం గురించి మాట్లాడటం జరిగిందన్నారు త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లు పెట్టేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. బిజెపి పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో ఆర్డినెన్స్ ద్వారా ఉమ్మడి సివిల్ కోడ్ తీసుకురావడానికి ముసాయిదా సిద్ధం చేశారన్నారు. దేశంలోని ముస్లింలందరినీ చంపాలని ఇస్లాం మతాన్ని ఖతం చేయాలని కొన్ని హిందూ సంస్థలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న అలాంటి వారిపై కేసులు కూడా నమోదు కావడం లేదు అన్నారు. భారతదేశంలో మెజార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్న బిజెపి పార్టీ మాత్రం రానున్న ఎన్నికలలో గెలవడానికి దీనిని ఆయుధంగా వాడుకుంటుందని పేర్కొన్నారు. బిజెపి తీసుకొస్తున్న ఈ కామన్ సివిల్ కోడ్ ను రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు వ్యతిరేకించాలన్నారు. ఓట్లు దాహం కోసం బిజెపి పార్టీ ఎంతో సుందరమైన అందమైన మణిపూర్ రాష్ట్రాన్ని మంటలలో తగలబెట్టిందన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న మైతీలు మరియు కుక్కిలు మధ్య ఘర్షణలను సృష్టించడం వల్ల 160 మంది పౌరులు చనిపోయారని 1.50 లక్షల మంది సర్వము కోల్పోయి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారని ఇంకా అనేకమంది శరణార్థులుగా మిగిలిపోయారని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. గిరిజన క్రైస్తవ తెగకు చెందిన కుక్కి ప్రజలు హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నయన్నారు. రాష్ట్రంలో వేలాదిమంది శరణార్థులుగా మిగిలిపోయారని వారిని ఓదార్చడానికి కూడా ప్రధాని అమిత్ షా వెళ్లలేదన్నారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న కుల మత విభజనలను దేశంలోనే పౌరులు అందరు కూడా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. అనంతపురం జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులకు పంటల భీమా మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు ఉరవకొండ నియోజకవర్గంలో 890 కోట్ల రూపాయల వ్యయంతో 55 వేల ఎకరాలకు సాగునీటిని అందించే డ్రిప్పు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. తక్కువ నీటితో రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని పూర్తి చేయలేక పోయిందన్నారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసిందని మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో విఫలమైందన్నారు డ్రిప్పు పరికరాలన్నీ నిరుపయోగంగా ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి పనులు పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, తాలూకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్,గిరిజన సంఘం నాయకులు రామాంజనేయులు, చెన్నా రాయుడు,సిపిఐ పార్టీ నాయకులు తలారి మల్లికార్జున, సుల్తాన్, రమేష్, నారాయణమ్మ, పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు, గోపాల్ నాగరాజు, రమణప్ప శ్రీ రాములు, మల్లేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img