2 గంటల్లో 20 లక్షలు.. 4 గంటల్లో 50 లక్షల అకౌంట్లు..
ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌కు పోటీగా తయారైన మెటా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. గంటల వ్యవధిలోనే లక్షల్లో అకౌంట్లు తెరవడం విశేషం. 4 గంటల్లోనే 50 లక్షల మంది ఖాతాలు ఓపెన్ చేశారు. దిగ్గజ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా మరో సోషల్ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్ తీసుకొచ్చింది. థ్రెడ్స్ పేరుతో వచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత అప్లికేషన్ గురువారం.. ఱూ, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఈ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్ లాంఛ్ చేసిన 2 గంటల్లోనే 20 లక్షల మంది అకౌంట్లు ఓపెన్ చేశారు. ఇక 4 గంటలకు ఆ సంఖ్య ఏకంగా 50 లక్షలకు పెరగడం విశేషం. మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ తరహా ఫీచర్లతో ఉన్న ఈ థ్రెడ్స్ యాప్‌ను.. ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చింది మెటా. ఇప్పుడు కొత్త థ్రెడ్స్ యాప్‌పై.. ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. ఈ కారణంతో త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారుల సంఖ్యను థ్రెడ్స్ మించిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇన్‌స్టాలో మీరు ఫాలో చేస్తున్న అకౌంట్లను .. కొత్త యాప్‌లోనూ అనుసరించే సౌలభ్యం ఉంది. టెక్ట్స్ రూపంలో ఉండే పోస్టుల్ని లైక్, కామెంట్ చేయడంతో పాటు.. ఇతరులకు షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ట్విట్టర్ సబ్స్క్రైబర్ల సంఖ్యను మెటా థ్రెడ్స్ మించిపోనుందన్న వార్తలపైనా మార్క్ స్పందించారు. దీనికి కొంత సమయం పట్టొచ్చని.. వంద కోట్ల మంది ఖాతాదారులతో పబ్లిక్ కన్వర్జేషన్ యాప్ ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ ఆ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయిందని.. తాము ఆ ఘనత సాధిస్తామని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.మెటా థ్రెడ్స్ యాప్ తీసుకురావడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. పూర్తిగా ట్విట్టర్‌ను పోలినట్లుగా ఈ యాప్ తీసుకురావడంతో ఒక నెటిజన్.. మెటా జ్తీశ్రీంజంప (కాపీ పేస్ట్) మాత్రమే వాడిందని వ్యంగ్యాస్త్రాలు సంధించగా. మస్క్ దీనికి స్పందిస్తూ .. నవ్వుతున్న ఒక ఎమోజీ పోస్ట్ చేశారు.
ఇక జుకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన సందర్భంగా.. 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. తన ట్విట్టర్ అకౌంట్లో మార్క్.. ఇవాళ ఉదయం ఒక ఫొటో షేర్ చేశారు. పాత స్ప్రైడర్ మ్యాన్ కార్టూన్ అది. దాంట్లో విలన్.. హీరో మాదిరి ఒకటే డ్రెస్సులో కనిపిస్తాడు. మస్క్‌ను ఉద్దేశించే.. మార్క్ జుకర్‌బర్గ్ ఈ పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు.