Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డెంగీ వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ

ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి జిల్లా వైద్యాధిక శాఖ అధికారి యుగంధర్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం నగరంలో డెంగీ నివారణ మాసోత్సవాలను పురస్కరించుకొని మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్, జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆధ్వర్యంలో గురువారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ డెంగీ వ్యాధి ప్రాణాంతకమని కొని జాగ్రత్తలు పాటిస్తే దోమకాటు ద్వారా వచ్చే మలేరియా, డెంగీ వ్యాధులనుండి రక్షణ పొందవచ్చని తెలియజేశారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనదని ఈ సమయంలో దోమలు వృద్ధి చెంది డెంగీ ఎక్కువగా వచ్చే అవకాశం వున్నదని దీనిని నివారించడానికి ప్రతి ఒక్కరు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. అందులో భాగంగా ఇంట్లో నీరు నిలువ ఉంచుకునే ట్యాంకులు,నీటి తెట్టెలు, డ్రమ్ములు శుభ్రపరచుకొని ఆరిన తరువాత మళ్ళీ కొత్త నీరు నింపుకొని వాటిపై మూతలు పెట్టుకోవాలని తెలిపారు. ఇంటి ముందు మురుగు నీటికాలువలు శుభ్రంగా పారేటట్లు చూసుకోవాలని, ఇంటి పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు, పాత డబ్బాలు,వాడిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ విదంగా దోమలు వృద్ధి కాకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.ఈ వ్యాధి నివారణలో మలేరియా విభాగం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, గ్రామ, వార్డ్ సచివాలయ ఆరోగ్యకార్యదర్శులు పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి ఓబులు మాట్లాడుతూ… కీటక జనిత వ్యాదుల నివారణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరనీ, ప్రజలు ఆరోగ్య సిబ్బంది సలహాలు, సూచనలు పాటించి దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ మహా ర్యాలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ప్రారంభమై తెలుగు తల్లి విగ్రహం వరకు అక్కడినుండి ప్రభుత్వసర్వజన వైద్యశాల ముందు మానవహారంగా ఏర్పడి దోమలు చిన్న ప్రాణులని,చిన్నప్రాణులు -పెను ప్రమాదం, దోమ పుట్టరాదు -కుట్టరాదు, దోమ తెరలు వాడండి -దోమకాటు నుండి రక్షణ పొందండి, పరిశుభ్రత అంటే ఆరోగ్యం -లేకుంటే అనారోగ్యం, మన అందరి ఓకే మాట -పరిశుభ్రత బాట,నిలువ ఉన్న నీరు -దోమల పుట్టిల్లు, పుట్టిల్లు,ప్రతి శుక్రవారం -డ్రై డే పాటించండి,దోమల నియంత్రణ -మనందరి భాద్యత అని నినాదాలు చేశారు. ఈ మహా ర్యాలీలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, డాక్టర్ మనోజ్ కుమార్, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ,మాస్ మీడియా అధికారి ఉమాపతి, డెప్యూటీ డెమో త్యాగరాజు, గంగాధర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ మారుతి ప్రసాద్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, గిరిధర్ రెడ్డి, నూర్ బాష, శ్రీధర్,మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img