Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మంత్రి అక్రమాలకు అధికారులు కొమ్ము కాస్తున్నారు

విశాలాంధ్ర – కర్నూల్ సిటీ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ లు నగరంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోకుండా అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని సిపిఐ సీనియర్ నాయకులు కె. జగన్నాథం విమర్శించారు.మంత్రి ఆయన సోదరుడు ఆక్రమించుకున్న 15 ఎకరాల బుడ్డా బుడ్డి మసీదు మాన్యాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, మంత్రి పదవి నుంచి ఆదిమూలం సురేష్ ను తొలగించాలని కోరుతూ గురువారం స్థానిక నగరపాలక కార్యాలయం ఎదుట సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు కే జగన్నాథం మాట్లాడుతూ మంత్రి ఆయన సోదరుడు 300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకొని విద్యాసంస్థలు, క్రికెట్ స్టేడియాలు నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు రోడ్లను కూడా వదలడం లేదని చెప్పారు. సివిల్ సప్లై గౌడెన్, పలు పాఠశాలలకు వెళ్లే ఈ 80 అడుగుల రోడ్డులో 20 అడుగుల రోడ్డు నాక్రమించుకొని పార్కులు ఏర్పాటు చేసుకొని రోడ్డుపై తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించడం దారుణం అన్నారు. ప్రభుత్వ స్థలాల అక్రమణ ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డుకి ఇరువైపులా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తోపుడు బండ్లు, చిన్న చిన్న బంకులను తొలగించి పేదల కడుపు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంత్రి ఆయన సోదరుడి భూకబ్జాలపై సిపిఐ ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఆందోళలు చేస్తున్న కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డుపై ప్రతిష్టించిన మంత్రి తల్లిదండ్రుల విగ్రహాలను తొలగించాలన్నారు. లేనిపక్షంలో మంత్రి ఆయన సోదరుడు భూకబ్జాలపై కరపత్రాలు వేసి విస్తృతంగా ప్రచారం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ నాయకులు శ్రీనివాసులు ,శ్రీనివాసరావు, మహేష్, బీసన్న, బాబయ్య, సురేష్, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img