Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సీఎం గారు వసతి గృహ విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరించడం తగునా

వసతి గృహ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోతే సీఎం కార్యాలయం ముట్టడి

ఏఐఎస్ఎఫ్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట,వాగ్వాదం

విశాలాంధ్ర -కర్నూల్ సిటీ : బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్నారని, అప్పటి ప్రతిపక్ష నేత,ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ దుయ్యబట్టారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇప్పటిదాకా వేచి చూసామని, ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని లేని పక్షంలో సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సోమన్న అధ్యక్షత వహించారు. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్నివాదం, తోపులాట జరిగింది. కొద్దిసేపు కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా శ్రీరాములు గౌడ్ మాట్లాడుతూ
కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని అన్నారు. అనేక వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని,విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటున్నారని వాపోయారు. నాడు, నేడు పథకం కింద సంక్షేమ వసతి గృహాలను మరమ్మతులు లేదా నూతన భవనాలు నిర్మిస్తామని అనేక ప్రగల్భాలు పలికి,పాత భవనాల్లోనే నడుపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరహా వసతి గృహాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. హాస్టల్ లలో వార్డెన్, కుక్, కమాటి, వాచ్ మెన్,ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్రాగునీరు,మరుగుదొడ్లు లాంటి మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు.రాష్ట్ర వ్యాప్తంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెండింగులో ఉన్నాయని అన్నారు.కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 3,000 రూపాయలను ఇవ్వాలని,విద్యార్థులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని, నాడు,నేడు పథకం కింద హాస్టల్స్ ను చేర్చి,శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు మరమ్మతులు లేదా నూతన భవనాలు నిర్మించి అభివృద్ధి చేయాలన్నారు.వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రతి హాస్టల్ లో ఆర్.ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని,వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్,కుక్,కమాటి, వాచ్ మెన్,ట్యూటర్ పోస్టులను భర్తీ చేయాలని, అమ్మాయిల రక్షణ కోసం హాస్టల్స్ ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు డిఆర్ఓ నాగేశ్వరరావు కు వినతిపత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్,థామస్, అల్తాఫ్, జిల్లా సహాయ కార్యదర్శులు విజేంద్ర, షాభీర్ భాషా,రంగస్వామి, జిల్లా నాయకులు మునిస్వామి,వెంకటేష్,అశోక్, శ్రీరంగ,నజీర్,శ్రీకాంత్,శివ,అనిల్ వసతి గృహల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img