Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నేతన్నలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని చేనేత కార్మికులకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నేతన్న నేస్తం 24 వేల రూపాయలు ఐదవ విడత సందర్భంగా ధర్మవరంలో చేనేత లబ్ధిదారులతో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ఇన్చార్జులు ప్రజలతో భారీ ర్యాలీని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు.”జై జగన్-జై కేతిరెడ్డి”అన్న నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి పట్టణంలోని వివిధ పుర వీధులలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు చేస్తున్న సంక్షేమ పథకాల వివరణకై, లబ్ధిదారులకు ప్రజలకు ఈ ర్యాలీని కేతిరెడ్డి నిర్వహించారు. అనంతరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు కు అన్యాయం జరిగితే ధర్మారం పట్టణంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు 37 రోజులు దీక్ష చేయడం జరిగిందని, ఇందుకు సంఘీభావంగా మద్దతు పలుకుతూ, ఆనాటి ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి హాజరు కావడం, చేనేత కార్మికులకు పూర్తి దశలో న్యాయం జరిగిందని వారు తెలిపారు. చేనేత కార్మికులకు నేతల నేస్తం రూపకల్పన ఈ ధర్మారం నుండే ప్రారంభం కావడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేడు నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికులకు ఒక వరం లాగా మారిందని తెలిపారు. 12,000 మంది చేనేత కార్మికులకు ఇంటి పట్టాలను కూడా ఇవ్వడం జరిగిందని, అదే విధంగా మగ్గానికి కావలసిన పరికరాలను కూడా సబ్సిడీతో కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేతలను ఆదుకునేది కేవలం ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని భరోసా తెలిపారు. అంతేకాకుండా ఆనాడు జిఎస్టిని 12 శాతం చేస్తే చేనేతలకు ఇబ్బంది అవుతుందని తెలపడంతో విత్డ్రా చేసుకోవడం జరిగిందని, నేడు ఐదు శాతాన్ని కూడా తొలగించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఆత్మహత్యలు దగ్గు ముఖం పడ్డాయని, లేనిపోని బురదలు చెల్లుతూ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారని, దుష్ప్రచారం ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు. కొన్ని వ్యక్తిగత విషయాలు, కుటుంబ తగాదాలు లాంటి జరగడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా తమ ప్రభుత్వం ఆదుకొని, ఆర్థిక సహాయాన్ని కూడా అందించుటకు వారు గుర్తు చేశారు. ఇటీవలే ధర్మవరం వ్యాపారస్తులపై దాడి చేసిన అవినాష్ గుప్తాను కూడా సమాచారం తెలిసిన వెంటనే వాట్సప్ ద్వారా ఫిర్యాదు అందజేయడంతో, దాడి చేసిన వ్యక్తిని రాజమండ్రి జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా చేనేత పరిశ్రమకు అండగా ఉంటూ చేనేత కార్మికుల జీవనోపాధికి తాము అభివృద్ధి పాటకు పాటుపడతామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం చేనేత కార్మికులను నేతల నేస్తం ద్వారా ఆదుకోవడం జరుగుతుందని వారు మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెనుజూరు నాగరాజు, మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, కో ఆప్షన్ నెంబర్లు, వైయస్సార్సీపి నాయకులు కాచర్ల అంజి, శుభాన్ భాష, వార్డు కౌన్సిలర్లు ఇంచార్జ్ నాయకులు చేనేత నేతన్న నేస్తం లబ్ధిదారులు వేల సంఖ్యలో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ ర్యాలీ విజయవంతం పట్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img