Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

దయచేసి మణిపూర్‌ అంశంపై చర్చలో పాల్గొనండి

ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విన్నపం

న్యూదిల్లీ: మణిపూర్‌లో జాతుల హింసపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చలో పాల్గొనాలని ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతులు జోడిరచి మరీ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను రాజకీయం చేయవద్దని ఠాకూర్‌ ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్షాలు సోమవారం పార్లమెంట్‌లో ఉమ్మడిగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ అంశంపై చర్చకు ముందు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ఆయా పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఈ అంశంపై ప్రధాని కాకుండా హోంమంత్రి అమిత్‌ షానే మాట్లాడతారని ప్రభుత్వం పట్టుబట్టింది. బాధితులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా మహిళలపై అఘాయిత్యాలు బాధాకరమని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని మంత్రి ఠాకూర్‌ అన్నారు. రాజస్థాన్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. ‘అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనే సభలో దీనిపై మంచి చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము. చర్చ నుండి ఎవరూ పారిపోవద్దు. ఇది ముకుళిత హస్తాలతో ప్రతిపక్షాలకు నా విన్నపం, చర్చ నుండి పారిపోకండి’ అని ఠాకూర్‌ అన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి అంశాలను రాజకీయం చేయవద్దని, పార్లమెంటులో చర్చకు రావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img