విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పిండి మిషన్ వద్ద డ్రైనేజీ తీయించాలని సోమవారం పెద్దకడబూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. చినుకు పడితే చాలు డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండి చిత్తడిగా మారుతుందని తెలిపారు. కావున అధికారులు స్పందించి డ్రైనేజీ తీయించి పారిశుధ్యం నెలకొల్పాలని కోరారు.