Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ట్విట్టర్‌లో పార్లమెంటు సమావేశాలు

మూడురోజులకింద ప్రారంభమైన పార్లమెంటు సమావేశం మూడో రోజూ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడిరది. గురువారం ప్రారంభమైన సమావేశాలూ ఏ రోజూ జరగనే లేదు. మణిపూర్‌ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను అధికారపక్షం ససేమిరా అంగీకరించడం లేదు. చర్చంటూ జరిగితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇస్తారని అధికార పక్షం అంటోంది. నరేంద్ర మోదీ ఇంత బెట్టు చేయడానికి కారణం అంతుపట్టదు. జరగవలసిన కార్యకలాపాలైతే స్తంభించాయి కానీ సభలో గలభా సృష్టించారన్న ఆరోపణపై ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్‌ ధన్‌కర్‌ ఈ సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్‌ చేశారు. ఏదో ఒక అదును చూసుకుని అధికార పక్షం కొన్ని బిల్లులను ఉపసంహరించుకుంది. పార్లమెంటు సమావేశాలు జరగకపోవడానికి మీరు కారణం అంటే కాదు మీరే కారణం అని ట్విట్టర్‌లో మాత్రం వాదోపవాదాలు కొనసాగు తున్నాయి. అంటే పార్లమెంటు సమావేశాలు ట్విట్టర్‌ కు పరిమితమై పోయాయనుకోవాలి. తమ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌ను సస్పెండు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని, దిల్లీ ప్రభుత్వంలో మంత్రి, రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చెడ్డా అంటున్నారు. మణిపూర్‌ పరిస్థితిపై ప్రధానమంత్రి స్పందించాలని ప్రతిపక్షాలు కోరుతూ ఉంటే రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ ఉదంతాల మీద కూడా చర్చ జరగాలని కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ వాదిస్తున్నారు. ఇది అసలు సమస్యను అటకెక్కించి కుటిల రాజకీయాలకు పాల్పడడమే. ప్రధానమంత్రి మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలలో సానుకూల మార్పు వచ్చిందని, ఆ ఏడు రాష్ట్రాలూ మిగతా భారత్‌ తో సమీకృతం అయి పోయాయని మోదీ భక్తులు అలసట లేకుండా వాదిస్తూనే ఉన్నారు. నిజానికి ఈశాన్య ప్రాంతం ప్రస్తుతం అల్ల కల్లోలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించినప్పుడు మోదీ ధరించిన రంగురంగుల టోపీలకు కొదవలేదు. మండిపోతున్న మణిపూర్‌ లో పర్యటించే సాహసం మాత్రం ఆయన చేయడం లేదు. అమిత్‌ షా ఆ రాష్ట్రంలో పర్యటించిన మాట వాస్తవమే కానీ ఆయన ప్రజలను కలుసుకున్నదీ లేదు. వారికి సాంత్వన కలిగించిందీ లేదు. అధికారులతో జరిగిన సమా వేశాల్లో హితవచనాలు పలకడానికే అమిత్‌ షా పర్యటన పరిమితం అయింది. మోదీ ప్రపంచ నాయకుడని సొంత బాకా ఊదడానికి ఆయన భక్తులు ఎప్పుడూ వెనకాడరు. ఆయన రష్యా-ఉక్రెయిన్‌ సమస్య పరిష్కరించడానికి ఎంత కృషి చేశారో చెప్పడానికి ఆ భక్తులు తంటాలు పడుతూ ఉంటారు. బెంగాల్‌ లోనూ మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన అంశాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తావించ నప్పుడు మణిపూర్‌ మారణకాండ గురించి మోదీ పట్టించుకోకపోతేనేం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో జరిగిన ఇలాంటి సంఘనలను పదే పదే ప్రస్తావించి మణిపూర్‌ మీంచి జనం దృష్టిని మళ్లించి ఆ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ను బోనులో నిలబెట్టడానికి నానా యాతనా పడ్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో జరిగిన దారుణాలను ఎవరూ సమర్థించడం లేదు.
ప్రతిపక్షాల్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జరుగుతున్న అఘాయిత్యాలు మణిపూర్‌ మారణకాండను చాప కిందకు తోసేయలేవు. మణిపూర్‌ పరిణామాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనంత తాను ప్రస్తావించి ప్రభుత్వం ఏమీ చేయకపోతే వారం రోజుల్లోగా మేమే ఏదో ఒకటి చేస్తామని ప్రకటించడం మోదీని ఇరకాటంలో పెట్టినా ఆయన మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మానలేదు. ప్రధాన న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కనక ప్రధాని రాజీనామా చేయాలని వాదించేవారూ ఉన్నారు. 140 మంది మణిపూర్‌ మారణకాండలో మరణించినా ప్రార్లమెంటులో నిలబడి సమాధానం చెప్పే ఉద్దేశం మోదీకి లేదు. పార్లమెంటు సభ్యులు ఈ విషయం గురించి ఏం చేస్తారు అని మోదీ అనుకుంటున్నట్టున్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యం ఒక్క మణిపూర్‌కే పరిమితం కాలేదు. తాము అధికారంలోకి వస్తే కశ్మీరీ పండితులు వాళ్ల స్వగృహాలకు వెళ్లే ఏర్పాటు చేస్తాం అని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ బీరాలు పలికింది. ఈఇ హామీ ఏ మాత్రం నెరవేరలేదు. కశ్మీరీ పండితులు ఇప్పటికీ శరణార్థుల శిబిరాల్లోనే మగ్గుతున్నారు. కశ్మీర్‌లో కనిపించిన సంపూర్ణ వైఫల్యమే మణిపూర్‌లో మరింత విస్తృతంగా ద్యోతకం అవుతోంది. మోదీ క్రియా రాహిత్యంవల్ల మణిపూర్‌ లో మెయితీలకు ఇతర వర్గాలకు మధ్య విభేదాలు మరింత తీవ్రమైనాయి.
లోకం దృష్టిలో మెయితీలు అపరాధులుగా మిగిలి పోయారు. వారు మణిపూర్‌ లోనే కాక మిజోరంలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కుంటున్నారు. మెయితీలు హిందువులే కావచ్చు. కానీ అక్కడ గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు, ముస్లింలు కూడా ఉన్నారు. మోదీ ప్రభుత్వ నిర్వాకం వీరి మధ్య విభేదాలను శాశ్వతం చేసే ప్రమాదం ఉంది. సకల రాజ్యాంగ వ్యవస్థలనూ మోదీ హయాంలో ధ్వంసం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని భావిస్తోంది. కానీ ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే సర్వస్వం కాదు. ప్రజాస్వామ్యాన్ని పదిలంగా కాపాడడానికి పార్లమెంటు సవ్యంగా పని చేయాలి. రోజుల తరబడి పార్లమెంటు స్తంభించడం వల్ల ఆ అవకాశం ఉండడం లేదు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పేరుకే తప్ప ఆచరణలో లేదు. మన ప్రజా స్వామ్య ఘనత ఊహాలోకాలకే పరిమితమైంది. ఏకచ్ఛత్రాధిపత్యమే ప్రజాస్వామ్యం అని భ్రమింపచేసే పాలన కొనసాగుతోంది. పార్లమెంటుకు జవాబు దారు కాని ఏ ప్రభుత్వమూ ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకోవడానికి వీలు లేదు. 2జి కుంభకోణం జరిగినప్పుడు అపారమైన పార్లమెంటరీ అనుభవం కలిగిన బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాక ముందే స్తంభింప చేస్తాం అని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. పార్లమెంటు సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్న సమయంలో దానికి కూడా అవకాశం లేకపోతే పార్లమెంటరీ వ్యవస్థలోని ఒక ప్రధానాంగం నిశ్చేష్టమైనట్టే. అయితే ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించే ఆలోచనే లేని దశలో భవిష్యత్తు అంధకార బంధురంగానే ఉంటుంది. పార్లమెంటరీ సమావేశాలలో అధికార పక్షాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రత్యర్థి పక్షం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే వ్యవస్థే అసలైన ప్రజాస్వామ్యం. కానీ ఈ లక్షణం ప్రస్తుత అధికార పక్షంలో కలికానిక్కూడా కనిపించడం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బయటికి చెప్పకుండానే అధ్యక్ష తరహా ప్రభుత్వంగా మార్చేసే ఉద్దేశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది వినాశకరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img