Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

గణపతి పునరాగమనము

ఈ దినము ఉపన్యాసకర్త రాలేదు. వివరము తెలియదు. కాలక్షేపమునకు ముచ్చటించుకొనుచుండగా ఒకరు చేతనున్న దినపత్రిక తెరిచి ‘తుపాకీ పేలి ఒకరు మృతి’ యను శీర్షికతో యున్న వార్త ఇట్లు జదివెను. సర్పవరమునకు చెందిన సుగుణమ్మకు, గణపయ్యయను యువకునికి గడిచిన యేడాది చిత్రనామ సంవత్సర వైశాఖమున వివాహము జరిగెను. సుగుణమ్మ ఒక్కగానొక్క కూతురగుటచే ఆమె తండ్రి వైభవముగా పెండ్లిజేసెను. వివాహమయిన పిదప గణపయ్య దేశరక్షణకు ఉద్యోగార్ధమై బోయెను. గణపయ్యకు తండ్రి లేడు. కోడలు పంచదార బదులు తెచ్చెదనని యొకసారి, కందిపప్పు బదులు తెచ్చెదనని యెకసారి, తెచ్చినవి బదులు తీర్చెదనని మరియొకసారి పలుమార్లు పొరుగింటికి పోవుచుండెను. కిటికీ రెక్కలు మూయకుండెను. అనుమానితురాలైన అత్త కోడలికి తెలియకుండా కుమారునికి ఉత్తరము వ్రాసెను. సరిహద్దున పహారా కాయుచున్న గణపయ్య హుటాహుటిన వచ్చి శత్రు సైనికునిపై యున్న ఆవేశమును పొరుగింటివానిపై జూపి బుర్రవంచి దభీదభీ మని గ్రుద్దుచుండ ఢాంమని తుపాకీ శబ్దము వినిపించెను. చూడగా గణపయ్య శవమై క్రింద పడియుండెను. సమాచారము తెలుసుకొని పోలీసులు వచ్చిరి. గోడవారనున్న తుపాకీ ఎటుల పేలెనో తెలియక మల్లగుల్లాలు పడుచుండిరి. ఇరుగు పొరుగు వారిని ఈ విలేకరి విచారించగా తన వ్యవహారమునకు అడ్డు తొలగించుకొనుటకు భార్యయే అటుల జేసినదని కొందరు, ఒకరికి తగులవలసిన గుండు మరి యొకరికి తగిలినదని మరికొందరు చెప్పిరి.
ఆ వార్త విన్న దాసు దీర్ఘాలోచనలో యుండగా తుపాకీ గుండు విషయమనుకొంటిని. అతడొక్కసారి లేచి అయ్యో! గణపతికి మృత్యువు ఇటుల రాసిపెట్టినదా. చిలకమర్తి వారి గణపతియును, ఈ గణపయ్య యును ఒక్కరేయని నా అనుమానము. గణపతికి తండ్రి లేడు. గణపయ్యకునూ తండ్రి లేడు. పోలీసుల నుండి తప్పించుకొని పోయిన గణపతి జాడ తెలియకుండుటచే చిలకమర్తివారు కధ అర్ధాంతరముగా ముగించిరి. జాడ తెలియలేదని తప్పించుకొనిరి. జుట్టుపట్టుకొని ఈడ్చుకొనివచ్చి రెండు దవడలు వాయించి విద్యాబుద్దులు నేర్పిన ఈ స్ధితి దాపురించెడిదా! వాని అల్లరి పడలేక పీడ విరగడైనదని విసిగి ఊరకుండుట తగునా! లేనిచో వీని చావు అర్ధాంతరమని ఊహించి ముగింపు కష్టాంతముగా నుండుట అసమంజసమని అటుల జేసెనా?
ఆచారి: నీవు జెప్పిన ప్రయత్నములన్ని విఫలమైనవి. గణపతి తుంటరివాడు. కొంటెవాడు. చుట్టకాల్చువాడు. చీట్లపేకాడువాడు. శరీరమంతయు జీర్ణకోశముగలవాడు. తెలిసి యొకటి తెలియక నొకటి రెండు అపరాధములు జేసెను. లక్కబొమ్మలు, లక్క పిడత లాడుచున్న మేమమామ కూతురినపహరించి వేరే ఊరికి గొనిపోయి దొంగపెళ్లి చేసుకొనెను. ఆ విషయం తల్లికి కూడా తెలియదు. మేనమామ ఉగ్రుడై గణపతిని చంపివైతునని, పేగులు జంద్యము వేసుకుందునని ప్రతిజ్ఞపూనెను. తన వరహాల మూటకు, వజ్రపు తునకకు ఎంత ఆపద వచ్చినదోయని రోదించి, మొరటి వాడైన అన్న అన్నంత పని జేయునని భావించి గణపతిని అతని తల్లి వేరే యూరికి గొనిపోయెను. ఇది తెలిసి చేసిన అపరాధము. ఇక రెండవది: ఒక బ్రాహ్మణుడు ఒక బాలికను వెంట బెట్టుకొని వచ్చి ఆమె తన కూతురని, కట్న కానుక లక్కర్లేదని కాశీకి పోవుటకు దారి ఖర్చులిచ్చిన చాలునని జెప్పుటచే ఉబలాటముతో ముందు వెనుక లాలోచించక పెళ్లి చేసుకొనెను. చూడగా ఆ బాలిక వాని కూతురు కాదు. డబ్బు ఆశించి ఇదివరకే ఒకనికిచ్చి పెళ్ళి జేయుటచే మొదటివాడు పోలీసులకు ఫిర్యాదు చేసెను. రక్షక భటులను జూచి గణపతి దొడ్డిదారిన పరుగుదీసి జాడలేకుండా పోయెను. జూచితివా! తెలిసి జేసిన అపరాధమునకు శిక్ష లేదు. తెలియక జేసిన అపరాధమునకు శిక్షపడెను.
శెట్టి : నాకు ఒక్క అనుమానము. గణపతి పొట్టివాడు. సైన్యమునకు ప్రవేశ అర్హత కష్టము.
దాసు : సంధి కాలమున, శాంతియుత వాతావరణమున నీవు జెప్పునది వర్తించును. యుద్ధకాలమున ఒడ్డు పొడుగులు చూడరు. ఆ వార్తలో నేమున్నది సరిగా చదువుము. బుర్ర వంచి వీపుపై దభీదభీమని గుద్దుచుండెనని లేదా? పొడుగు వాడైన ముష్టి యుద్ధము జేయునుగదా.
శెట్టి : వీరమరణము పొందవలసిన గణపతి ఊరకుక్క చావు జచ్చుట దుఖ:దాయకము.
దాసు : తుపాకీ గుండునకు చచ్చుటచే వీరమరణమని భావించుట తప్పులేదు.
అంతట శాస్త్రి లేచి ఈ గణపయ్య, చిలకమర్తి లక్ష్మీనరసింహము వారి గణపతి యొక్కరు కాదు. మీరు అటులనుకొనుట ఆయన రచనా వైశిష్ట్యమునకు, చమత్కారమునకు, సహజ నటనాభ్యాస కౌశలమునకు నిదర్శనము. నాటకమున గుడ్డివాడుగా నటించవలెనన్న గుడ్డివానిని జూచి యనుకరింతురు. కుంటివానిగా జేయవలెనన్న కుంటివానిని జూచి రక్తి కట్టింతురు. సభ్యసమాజమున తమ అనుభవములు, అనుభూతులనే రచయితలు కధలుగా మలుతురు. కొసమెరుపు జూచిముగింతురు. కష్టాంతము, సుఖాంతము జూడరు. చిలకమర్తి వారు స్వాతంత్య్ర దీక్షా కంకణ బద్దుడు ‘‘భరత ఖండంబు యొక్క బందిఖాన’ యను గీతముతో కష్టములను కడగండ్లను కళ్లకు కట్టినట్లుగా జూపి జనులను కార్యోన్ముఖులను చేసిన మహానుభావుడు. ఆయనను స్మరించుకొని పోవుదమ’’ ని జెప్పెను. గుండె బరువుతో నేను ఇంటికి బోతిని.
పానుగంటి వారికి కృతజ్ఞతలతో
ఎస్‌.జి.కె.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img