London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

బీజేపీ ఓటమితోనే రైతుకు మేలు

. ‘కర్షకకార్మిక’ రాష్ట్ర సదస్సులో వక్తలు
. 9న ‘క్విట్‌ కార్పొరేట్‌భారత్‌ బచావో’ జిల్లా స్థాయిలో నిరసనలు
. 15న ‘మోదీ హఠావో`దేశ బచావో’ గ్రామ, మండల స్థాయిలో పాదయాత్రలు

విశాలాంధ్రవిజయవాడ: కేంద్రంలో అధికార బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడిరచటం ద్వారానే దేశంలో రైతులకు మేలు జరుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా రైతు, కార్మిక సంఘాలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి, ఆంధ్ర ప్రదేశ్‌ ట్రేడ్‌ యూనియన్ల ఐక్యవేదిక సంయుక్త అధ్వర్యంలో ‘కర్షకకార్మిక’ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆంధ్ర ప్రదేశ్‌ కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం ఈ సదస్సు జరిగింది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఉపాధ్యక్షులు హనన్‌ మొల్లా మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ రైతులు, కార్మికులను శత్రువుగా భావిస్తారని విమర్శించారు. రైతులు, కార్మికులు ఉత్పత్తి వర్గానికి చెందిన వారని అన్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసం మూడు నల్ల చట్టాలు, నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకువచ్చిందని తెలిపారు. రైతు చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా రెండో దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందన్నారు. ఈ ఉద్యమంలో ఏడు జాతీయ స్థాయి డిమాండ్లతో పాటు ఆయా రాష్ట్రాల్లోని డిమాండ్లను కూడా చేర్చి తీర్మానం చేయాలని సూచించారు. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా స్ఫూర్తితో క్విట్‌ మోదీ, క్విట్‌ కార్పొరేట్స్‌ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 24న దిల్లీలో రైతు, కార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిసెంబరులో భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఆ ఉద్యమంలో ఆంధ్ర ప్రదేశ్‌ కీలకంగా ఉండాలన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి బీజేపీని తరిమికొట్టాలన్నారు. దేశ సంస్కృతిని నాశనం చేస్తోందని, హిందూ, ముస్లింలు, మణిపూర్‌లో హిందూ, క్రిస్టియన్ల మధ్య విద్వేషాలను సృష్టించిందని విమర్శించారు. మణిపూర్‌ ఘటన భారతదేశ ఐక్యతను దెబ్బతీసిందన్నారు. దేశ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, మూడేళ్లు పాటు జరిగిన రైతు ఉద్యమాలను సమీక్షించుకోవాలని సూచించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను మాత్రమే కాకుండా వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా వదిలించుకోవాలని హెచ్చరించారు. ఎన్‌ఏపీఎం నాయకులు మేధా పాట్కర్‌ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో పోలవరం, బాక్సైట్‌ తవ్వకాలతో ఆదివాసీల సమస్యలు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, రాజధాని రైతు ఉద్యమాలను జరుగుతున్నాయని, రైతు సంఘాలు ఐక్యంగా ఆయా ఉద్యమాల్లో పాల్గొంటు న్నాయని చెప్పారు. రైతు భరోసా పథకంలో కొంత డబ్బులు ఇస్తున్నారేగానీ, భూముల హక్కులు ఇవ్వటం లేదన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని సవరించి ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తున్నారని, దీనిని ప్రజలు వ్యతిరేకించాలన్నారు. మోదీ ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారేగానీ మణిపూర్‌లో పర్యటించటం లేదని విమర్శించారు. జీ20 సదస్సు ఉద్దేశం దేశ సంపదను కార్పొరేట్‌లకు అప్పగించే ప్రక్రియగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జాతీయ అధ్యక్షులు సుఖపాల్‌ సింగ్‌ ఖైరా మాట్లాడుతూ రూ.45 లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో రైతులకు కేటాయించింది కేవలం 2.8 శాతం మాత్రమే అని తెలిపారు. రాజకీయ పార్టీలు రైతులు, కార్మికుల తలరాతలు మార్చలేవన్నారు. కిసాన్‌, జవాన్‌పై దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్‌ ఘాయాల్‌ మాట్లాడుతూ విప్లవకారులు పెట్టుబడిదారీ విధానాలను అర్థం చేసుకుని పోరాడాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ లౌకిక స్వరూపాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. కేకేయూ జాతీయ కార్యదర్శి రామీంద్రసింగ్‌ పాటియాల మాట్లాడుతూ అపరాలు పండిరచటం, నూనెలు ఉత్పత్తి చేయటం దేశ రైతులకు తెలుసునని, అయినా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు డబ్బులు ఇవ్వదని, విదేశీ సంస్థలకు దోచిపెడుతుందని మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ రెండవ దశ రైతు ఉద్యమంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అనే బీజేపీని ఓడిరచాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ ప్రజలను మోదీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. మణిపూర్‌లో ఖనిజ సంపదను కార్పొరేట్‌లకు ఇవ్వటానికే అక్కడ గొడవలు సృష్టించారని ఆరోపించారు. సభకు అధ్యక్షత వహించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతు ఉద్యమాల తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆగస్టు 9న ‘క్విట్‌ కార్పొరేట్‌భారత్‌ బచావో’ పేరుతో అదానీ, అంబానీ, వేదాంత అనిల్‌ అగర్వాల్‌కు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు చేయాలని అన్నారు. ఆగస్టు 15న ‘మోదీ హఠావో`దేశ బచావో’ తో గ్రామగ్రామాన పాదయాత్రలు చేయాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం నాయకులు నర్సింగరావు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమాన్ని వివరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ బలపర్చారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమాలకు సంబంధించి వడ్డే శోభనాద్రీశ్వం రావు రాసిన పుస్తకాన్ని హనన్‌ మొల్లా ఆవిష్కరించారు. ముందుగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆశువులు బాసిన 734 మంది రైతులకు సదస్సు నివాళులర్పించింది. సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు స్వాగతం పలికారు.
ఆంధ్ర ప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య వందన సమర్పణ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజానాట్య మండలి, ఏపీ ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక వేదిక కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబు లేసు, వివిధ రైతు సంఘాల నాయకులు వి.కృష్ణ, రాయల చంద్రశేఖర్‌, యెర్నేని నాగేంద్రనాధ్‌, భవానీ ప్రసాద్‌, ఎస్‌.రaాన్సీ, కుర్రా నరేంద్ర, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జెట్టి గురున్నాధం, మహిళా సంఘాల నాయకులు గద్దె అనురాధ, పి.గంగా భవాని, నాయకులు కొలనుకొండ శివాజీ, మరీదు ప్రసాద్‌, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి రైతు, కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img