Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డు గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటాం..

తాసిల్దార్ యుగేశ్వరి దేవి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డ్ గుర్తింపు కార్డు ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని, ఓటర్ సర్వే కార్యక్రమం విజయవంతం అయ్యేలా వివిధ రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని స్థానిక తాసిల్దార్ యుగేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమును నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటా ఓటర్ సర్వే కార్యక్రమంపై సమీక్ష తోపాటు ప్రగతి వివరాలను రాజకీయ పార్టీ నాయకులకు తాసిల్దార్ వివరించారు. సమావేశంలో రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓటర్ సర్వే కార్యక్రమానికి రాజకీయ పార్టీ పరంగా సహాయ సహకారాల అందిస్తున్నామని, కానీ కుటుంబంలో వివాహం అయిన వారిని తొలగించడం లేదని, ఆ విషయంపై త్వరగా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కు కోరారు. స్పందించిన తాసిల్దార్ మాట్లాడుతూ వివాహం అయినవారి జాబితాను సేకరించి నోటీసులు ఇచ్చి, డబుల్ ఎంట్రీలు లేకుండా సజావుగా నిర్వహిస్తామని సమాధానం చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఫారం-6 ద్వారా ఓటర్ను నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీనిపైన అందరూ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఫారం-6,7,8 లో పొందుపరిచాల్సిన వాటిని మాత్రమే నమోదు చేయడం జరుగుతుందన్నారు. మృతి చెందిన వారిని కూడా తొలగించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో31/7/2023 నాటికి 8,890 ఇళ్లను బిఎల్ఓ, బిఎల్ఎ ద్వారా సర్వే నిర్వహించామని, ఇందులో 19,678 మంది ఓటర్లను విచారణ సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో 365 మంది నూతన ఓటర్లుగా,45 తొలగింపులుగా,496 సవరణలు బదిలీలుగా చేయడం జరిగిందన్నారు. ఈ సర్వే నిర్వాహణ కార్యక్రమం ఈనెల 20వ తేదీ వరకు పగడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఉప తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి, సిబ్బంది రాజకుమార్, బిజెపి, టిడిపి, టిడిపి, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img