Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మణిపూర్ లో మహిళలపై, ప్రజలపై జరుగుతున్న హింసకు సిఐటియు నిరసన

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల మణిపూర్లో మహిళలపై అక్కడున్న ప్రజలపై జరుగుతున్న హింసకు నిరసనగా మంగళవారం సిఐటియు తో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో చేనేత కార్మిక సంఘం, రైతు సంఘం, ఐద్వా మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలతో కలిసి స్థానిక సిఐటియు కార్యాలయము నుండి కళాజ్యోతి, కాలేజ్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి సిఐటియు మండల కార్యదర్శి అయుబ్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఐద్వా అధ్యక్షురాలు కామ్రేడ్ దిల్షాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దన్న, సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున మాట్లాడుతూ.. అంతులేని ఆకృత్యాలకు మణిపూర్ రాష్ట్రం కేంద్రంగా మారిందని అక్కడి మహిళల కన్నీటి కథలు, డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యం కుతంత్రాలను ఎత్తిచూపుతున్నాయని తెలిపారు. మతోన్మాద విద్వేష భావజలం తలకెక్కిన మానవ మృగాల మరణకాండలో, దేశం కోసం పోరాడి తన కాలును పోగొట్టుకున్న ఒక సైనికుడి భార్యకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని వారు ప్రశ్నించారు. మరో సంఘటనలో స్వాతంత్ర సమరయోధుడు సురాచంద్ సింగ్ భార్యను కొంతమంది దుండగులు సజీవ దహనం చేయడం చాలా బాధాకరమన్నారు. అక్కడున్న ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడమే కాకుండా ఇంటర్నెట్ ను బందు చేసి, అక్కడ జరుగుతున్న హింసాత్మకమైన ఘటనలు బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం సిగ్గుచేటు అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ, డబ్బులు ఇంజన్ సర్కార్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ , అయూబ్ కాన్, ఎస్హెచ్ భాష, ఖాసిం వలి, బాలాజీ, సే, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకు రాళ్లు.. చంద్రకళ, పోతక్క, డీనా, భువన, అరుణ, మాంచాలి, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బాబు, చెన్నకేశవులు, వెంకటేష్, ప్రసాద్, నరసింహ, ముత్యాలు, విద్యుత్ మీటర్ రీడర్స్ నాయకులు దస్తగిరి, కిరణ్ కుమార్, టాటా ఏసీ కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, కుళ్లాయప్ప, ముస్తఫా, మురళి, రమేష్, సయ్యద్, చంద్ర, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img