ముంబై : గ్లోబల్ ఇన్నోవేటర్, హై-క్వాలిటీ అల్యూమినియం కాంపోజిట్ మెటీరియల్స్ తయారీదారు, స్విస్ అగ్రగామి సంస్థ అయిన 3ఏ కాంపోజిట్స్ ఫ్లాగ్షిప్ బ్రాండ్ అలుకోబాండ్ తన ప్రీమియర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి ప్రత్యేక, క్లాసిక్ శ్రేణి రంగులు, సర్ఫేసెస్ను ప్రారంభించింది. మూడు కొత్త ఉత్పాదనలు కలర్ స్కేప్స్, కాంక్రీట్, గ్రోవ్లను విడుదల చేసింది. ఈ మూడు సిరీస్‌ల జోడిరపుతో, అలుకోబాండ్ ఎంచుకోవడానికి 40 కంటే ఎక్కువ రంగుల కొత్త ఆకర్షణీయమైన పోర్ట్‌ఫోలియోను అందించింది. ఈ మూడు సిరీస్‌లతో దీర్ఘకాల నిర్మాణ ఉపయోగం కోసం ఉత్తమ ఉపరితల పూత, రంగులను పరిచయం చేస్తూ, అలుకోబాండ్ ఆర్కిటెక్ట్‌లకు వారి డిజైన్లకు ప్రత్యేకమైన గుర్తింపును అందించడానికి వీలు కల్పించింది. ఈ కొత్త పోర్ట్‌ఫోలియో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణమవుతున్న ప్రీమియం వాణిజ్య, నివాస భవనాలు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ లేదా సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందింది.