Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

విశేష స్పందన పొందిన జగనన్న సురక్ష కార్యక్రమం

జిల్లాలో విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమం
జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

విశాలాంధ్ర – ఏలూరు : అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో జూలై 1 న నుంచి నిర్వహించిన ‘జగనన్న సురక్షా’ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.వివిధ పాఠశాలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే వివిధ ధృవీకరణ పత్రాలను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన లభించిందన్నారు.ఏలూరు జిల్లాలోనీ 605 సచివాలయములందు 10671 మంది వాలంటీర్లు జగనన్న సురక్ష కార్యక్రమములో పాల్గొని 6,92,365 కుటుంబములకు గాను 6,18,317 కుటుంబములని సందర్శించి, ప్రతి ఒక్కరి ఇంటికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న 11 రకాల సర్వీసుల గురుంచి వారికి వివరించి, వారి నుండి 4,10,287 అర్జీలను స్వీకరించి, 3,89,387 సర్విస్ సేవలు నేటివరకు అందజేయుట జరిగినదన్నారు. అదేవిధముగా 2,657 అర్జీలకు గాను సరైన ఆధారాలు సమర్పించి యుండి ఉండనందున సదరు దరఖాస్తులను తిరస్కరించడమైనదన్నారు. ఇంకనూ మిగిలి ఉన్న 6,301 దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయన్నారు.
జూలై 1 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో జరిగిన జగనన్న సురక్ష శిబిరాల్లో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు 1,73,329 , ఆదాయ దృవీకరణ సర్టిఫికెట్లు 1,41,897, ఆధార్ కు మొబైల్ నెంబర్ అప్డేషన్ 17,661, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు 319, కొత్త రేషన్ కార్డులు, రైస్ కార్డుల స్పిట్టింగ్ కు 2,067, మ్యూటేషన్లు 153, హౌస్ హోల్డ్ నుంచి వివాహమైన వారిని వేరు చేయుటకు 224, వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్లు 73, సిసిఆర్ కార్డులు 762, ఆర్ ఓ ఆర్ 1బి సర్టిఫికెట్లు -7,408 జారీ చేయడమైనదన్నారు. ఈ సురక్ష ప్రోగ్రామ్ జులై నెలలో 51000 మొక్కలు నాటడం జరిగినది. ఈ సురక్ష కార్యక్రమంలో 24 కొత్త గ్రామ సచివాలయం భవనాలు, 13 కొత్త రైతు బరోసా కేంద్రాలను 8 కొత్త వైయస్సార్ హెల్త్ క్లీనిక్ లను ప్రారంబించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమమునకు సహకరించిన అధికారులకు, గౌరవ ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img