Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బీజేపీ పాలనలో బ్యాంకు మోసాలు రెట్టింపు

బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బడా కంపెనీలకు సహాయం చేయడంలోనే తలమునకలై ఉంది. ఎన్నికల బాండ్ల ద్వారా కంపెనీలు, కార్పొరేట్లు బీజేపీకి కావాల్సినన్ని విరాళాలు అందచేస్తున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, అనంతరం లోకసభకు జరగనున్న ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ విచ్చలవిడిగా నిధులను ఖర్చు చేస్తుంది. 202223 సంవత్సరంలో బడా కంపెనీలు, కార్పొరేట్లు తీసుకున్న 2.09 లక్షల కోట్లను రద్దు చేశారు. ప్రయోజనం పొందినవారంతా బీజేపీ కోసం ఎంతైనా ఖర్చుచేయగల పరిస్థితి ఉంది. మోదీ తొమ్మిదేళ్ల పాలనాకాలంలో బ్యాంకులకు చెల్లించవలసిన 14.49 లక్షల కోట్లను రిజర్వు బ్యాంకు ద్వారా రద్దు చేయించారు. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలిపోయే దశకు చేరుకున్నది. అయితే ప్రభుత్వం బ్యాంకులకు నిధులను సమకూర్చి తిరిగి పట్టాలపై కెక్కించారు. 201415 నుంచి 202021 నాటికి తీసుకున్న రుణాలను చెల్లించకుండా ఉన్న 10.7 లక్షల కోట్లను రద్దు చేశారు. 202021లో 2,02,781 కోట్ల రూపాయలను రద్దు చేశారు. అలాగే 202122లో 1,74,966 కోట్లు రద్దు చేశారు. 202223లో రద్దుచేసిన బకాయిలు 2,09,110 కోట్లకు పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి రద్దుచేసిన బకాయిల మొత్తం 14.9 లక్షల కోట్లకు పెరిగింది. తను అధికారానికి వస్తే, బకాయిల రద్దు వ్యవహారాన్ని నడవనివ్వబోనని మోదీ వాగ్దానం చేశారు. ముఖ్యమైన వాగ్దానాలేవీ ఆయన నెరవేర్చలేదు. 201315లో బ్యాంకు మోసాలు 4,306 కాగా, అవి 202122నాటికి 9,103 వేలకు పెరిగాయి. అంటే మోదీ కాలంలో బ్యాంకు మోసాలు రెట్టింపయ్యాయి. 202223 ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంకు మోసాలు మరింతగా పెరిగి 13,530కి చేరాయి. దాదాపు 49శాతం డిజిటల్‌ మోసాలు జరిగాయి. ఈ అంశాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయి. రుణాలు తీసుకుంటున్న మోసకారులు అధికారులతో కుమ్మక్కవుతున్నారు. ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాలెన్స్‌ షీట్లను ప్రక్షాళన చేసేందుకు రద్దుచేస్తున్న రుణ బకాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పైగా రద్దుచేసే రుణాలకు నిరర్థక ఆస్తులని ఒక ముద్దుపేరు పెట్టారు. రుణాలు తీసుకున్నవారి నుంచి వసూలు చేసేందుకు అటు ప్రభుత్వంకానీ, ఇటు బ్యాంకులు కానీ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. దీనితో సామాన్య ప్రజలు, దిగువ, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకుని డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో ఉంచిన మొత్తాలు బడా కార్పొరేట్లు, భారీ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. రుణ బకాయిలను రద్దుచేసిన తర్వాత బ్యాలెన్స్‌ షీట్లను సరిచేసుకుని మళ్లీ ఇలాంటి మోసకారులకే వేలకోట్ల రుణాలు అందచేస్తున్నారు. అయితే ఏఏ కంపెనీలకు ప్రభుత్వం రుణాలను రద్దు చేస్తుందనే అంశం కూడా ఎవరికీ తెలియదు. కంపెనీల, కార్పొరేట్ల పేర్లు తెలిసినప్పటికీ ప్రభుత్వం కనీసం పార్లమెంటుకు కూడా తెలియజేయకుండా ప్రజలను మోసగిస్తున్నది. మూడవపార్టీకి ఈ రుణాల వసూలు బాధ్యతను అప్పగించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలగడంలేదు. కోటి రూపాయలకుపైగా ప్రభుత్వరంగ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఎగవేసిన మోసకారుల జాబితాను ప్రభుత్వానికి రిజర్వుబ్యాంకు అందచేసింది. ప్రభుత్వం ఈ జాబితాను వెల్లడిరచలేదు. తిరిగి వసూలు చేయలేని ఎగవేతదారుల రికార్డులు మాత్రమే బ్యాంకులలో ఉంటాయి. ఎవరెవరు ఎంత ఎగవేసారనే వివరాలు బ్యాంకులకే తెలుస్తాయి. గత మూడేళ్లకాలంలో 1,09,186 కోట్ల రూపాయలు మోసకారుల నుంచి వసూలు చేసినట్లుగా ఆర్‌బీఐ తెలిపింది. ఈ మూడేళ్లలో రద్దుచేసిన మొత్తం 5,86,891 కోట్లు, రద్దుచేసిన రుణ బాకాయిలలో ఇది కేవలం 18.6 శాతం. 2022 డిసెంబరు నాటి ఆర్థిక సుస్థిరత నివేదిక ఇలా ఉంది. ‘‘కష్టాలనుంచి ఇంకా బైటపడలేదు.’’ అని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. 2023 సెప్టెంబరు నాటికి బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు 9.4శాతానికి పెరగవచ్చునని కూడా బ్యాంకు తెలిపింది. అలాగే ప్రైవేటు బ్యాంకులలో నిరర్థక ఆస్తులు 5.5శాతానికి పెరగనున్నాయి. విదేశీ బ్యాంకులలో నిరర్థక ఆస్తులు 4.1శాతానికి పెరిగాయని ఆర్‌బీఐ హెచ్చరించింది. 2023 జూన్‌ నాటికి ఆర్‌బీఐ తన ఆర్థిక సుస్థిరత నివేదికలో స్థూల ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుందని కూడా నివేదిక వెల్లడిరచింది. అంతర్జాతీయంగా అంగీకృత నిరర్థక ఆస్తులు 12శాతం మాత్రమే ఉంటుంది. భారీ మొత్తాలను రద్దుచేసిన తర్వాత బ్యాంకు బాలెన్స్‌షీట్ల ప్రక్షాళన పూర్తయ్యాక బ్యాంకింగ్‌ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని పెట్టుబడుల నిల్వజరిగిన కాలంలో కంటే నేడు అత్యున్నత స్థాయికి చేరిందని రిజర్వుబ్యాంకు చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఖాతాదారులు బ్యాంకులను నమ్ముకుని డిపాజిట్లు చేస్తారు. బడా కార్పొరేట్లు, కంపెనీలకు కోట్ల రూపాయలు రద్దుచేసి వారినుండి వీలున్న మేరకు విరాళాల రూపంలో సహాయం పొందుతారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయిపోయింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ అసమర్థంగా దిగజారిపోయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతున్నది. నిరర్థక ఆస్తుల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటోంది. లక్షల కోట్ల రుణ బకాయిలను రద్దు చేయడం వల్ల ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న వాస్తవం మన కళ్లముందే ఉంది.
`ఎడిట్‌ పేజీ డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img