Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పాలకుల పాపం మణిపూర్‌ కల్లోలం

డాక్టర్‌ రజని

అసలు మణిపూర్‌లో ఏమి జరుగుతోంది? రాష్ట్రంలోని కుకీలు, 70శాతం ప్రజలు ఎందుకు తమకు ప్రత్యేక పాలన కావాలని కోరుకుంటున్నారు.? మెయితీలు, ప్రభుత్వం ఎందుకు ప్రాంతీయ పాలనా ప్రాంతం కావాలంటున్నారు? ఈ ఘర్షణల్లో మహిళలు ఎక్కువగా ఎందుకు బలి అవుతున్నారు.? మెయితీలకు ఎస్‌టీ స్టేటస్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? కుకి ప్రజలు మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు విడిచిన వారు చాలామంది ఉన్నారు. ఐఎన్‌ఏ మెమోరియల్‌ దగ్గరచూస్తే ఎంతోమంది కుకీస్‌ పేర్లు ఉంటాయని ది వీక్‌ పత్రికలో ఒక లాయరు పేర్కొన్నారు. అలానే ఒక వర్గాన్ని అస్సాం రైఫిల్స్‌ రక్షిస్తుంటే, మరో వర్గాన్ని మణిపూర్‌ పోలీసులు రక్షిస్తున్నారని తెలుస్తోంది. అంటే ఒక వర్గం ఎక్కువగా ఉండే ప్రదేశంలో మరో వర్గం ప్రజలు వెళ్లి పనిచేసుకోవాలి అంటే భయాన్ని కల్పిస్తున్నది ఎవరు? కుకీల గ్రామంలో ఉన్న మెయితీల కుటుంబాలని కుకీలు రక్షిస్తున్నారని అక్కడ మెయితీ కుటుంబాలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రస్తుత మారణహోమాన్ని రగిలిస్తున్నదెవరు? ప్రోత్సహిస్తున్న దెవరు? దీనిపై ప్రజలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల మధ్య సఖ్యత నెలకొనాలి. మణిపూర్‌ యువతకి ఏకే 47 రైఫిల్స్‌ కాదు కావలసింది జీవించడానికి ఉపాధి. మణిపూర్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలు వారి భర్తలను, తల్లులను, పిల్లలను పోగొట్టుకొని విలపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది. అమ్మాయిలపై లైంగిక దాడులు వీటిపై ప్రభుత్వ నియంత్రణలేదా? పరిష్కారాలు చూపడంలేదా అంటే లేదు. ఏకే47 తుపాకులు, మారణ ఆయుధాలు అమ్మకాలపై రాష్ట్రంలో నియంత్రణ లేదా? గ్రామ రక్షణ కమిటీలు వారి ప్రజలను రక్షించుకోడానికి ఆయుధాలను ఎక్కువ ధరలుపెట్టి కొనవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే ముమ్మాటికీ ప్రభుత్వాల వైఫల్యమే.
వీటన్నింటికీ కారణాలు మణిపూర్‌లోని ప్రస్తుత ప్రభుత్వ దుష్ట ఎత్తుగడలు కాదా! మణిపూర్‌లో కుకీస్‌, జోలు ఎప్పటినుంచో ఉన్నారు. లోయకి ఒక ప్రక్క కుకీలు, మరోపక్క నాగాలు. గిరిజనులైన నాగాలు కొండ ప్రాంతాలలో దొరికిన వనరులతో జీవనం సాగిస్తున్నారు. కొండ ప్రాంతాలలో వీరికి విద్య, వైద్యం వంటి సదుపాయాలు లేవు. అన్ని ప్రాంతాలలో వలెనే క్రిస్టియన్‌ మిషనరీలు కొండ ప్రాంతాల్లో తగిన సదుపాయాలు కల్పించడంతో వారిలో కొంతమంది క్రిస్టియన్స్‌గా మారారు. మెయితీలు ఎక్కువగా ఉన్న లోయప్రాంతం బాగా సారవంతమైనది. అక్కడ వీరికి ఇంచుమించు అన్నిసదుపాయాలు ఉన్నాయి. కుకీస్‌ కొంతమంది ఇక్కడకు వచ్చి పనులు చేసు కోవడంతో రెండు పక్షాల మధ్య చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
మణిపూర్‌లోని కొండ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజన హక్కుల చట్టం కింద ఎవ్వరూ ఆ ప్రాంతాన్ని అమ్మడానికి, కొనడానికి హక్కు లేదు. కొండప్రాంతాల్లో చొరబడి వారిస్థలాలను ఆక్రమించుకునే హక్కు ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో మెయితీలకి ఎస్‌టీ హోదా ఇవ్వడానికి పరిశీలించాలని హైకోర్టు చెప్పడంలో అర్థంఏమిటి? మెయితీలకు ఎస్‌టీ హోదా ఇచ్చి కుకీల కొండప్రాంతాన్ని ఆక్రమించి, కార్పొరేట్స్‌కి అప్పనంగా భూమిని అప్పచెప్పవచ్చు అనేది రాష్ట్రప్రభుత్వ యోచన. ఈ దురుద్దేశంతోనే రెండు గ్రూపుల మధ్య మరణహోమానికి ప్రభుత్వం ఆజ్యం పోసింది. కొండ ప్రాంతం లోని క్రిస్టియన్స్‌ను హిందువులుగా మార్చా లన్న ప్రభుత్వ యోచనతోపాటు వారిని ఎలా హతమార్చాలి అనేది రాష్ట్రప్రభుత్వ ఆలోచన. అనాదిగావస్తున్న పితృస్వామ్య భావజాలం, మనువాద భావజాలం స్త్రీని దేవతఅని చెప్పేవారే స్త్రీని ఒక వ్యాపారవస్తువుగా పరిగణించడం పరిపాటైంది. ఆర్థిక అసమానతలు, కుల వివక్ష, మతం మత్తు, ఆర్థికదోపిడీని నిర్మూలించకుండా సమసమాజ స్థాపనకు ప్రయత్నించకుండా ఉన్నంతకాలం దళితులు, మైనార్టీలు, స్త్రీలు, గిరిజనులు అందరూ ఇటువంటి సమస్యలను అనుభవిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఈ పరిస్థితులను ఎదుర్కొని ప్రజలు పోరాడవలసిన తరుణం ఆసన్నమైంది.
రాష్ట్రంలో ఓ పక్క మహిళలపై అత్యాచారాలు చేసి వీధుల్లో నగ్నంగా ఊరేగిస్తుంటే, మరోపక్క ప్రధానమంత్రి దేవాలయం లాంటి పార్లమెంటు ముందు మొసలి కన్నీరు కార్చి ఇలాంటి ఘటనలు చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, బెంగాల్‌లో జరిగాయి అనడం శోచనీయం. స్త్రీలపై జరిగిన అత్యాచారాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం మనపాలకుల అవినీతికి నిదర్శనం. మణిపూర్‌లో మూడునెలలుగా జరుగుత్ను మారణహోమంపై ప్రధాని ఇప్పటికీ స్పందించకపోవడం ఎంత వరకు సమంజసం? గుజరాత్‌లో బిల్కిస్‌బానోపై అత్యాచారం చేసి, కుటుంబ సభ్యులను హత్యచేసి కిరాతకులను జైలునుండి విడుదల చేసిన తర్వాత వారిని సత్కరించిన ఘనత మనది. నిజానిజాలు తెలుసుకొని మత విద్వేషాలు రాకుండా మత సామరస్యాన్ని కల్పించవలసిన బాధ్యత దేశ ప్రధానిది, ప్రజా ప్రతినిధులది. మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలి.
ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ అజెండాలు మాను కోవాలి. మణిపూర్‌ ప్రజలలో 40మంది ఎంఎల్‌ఏలు మెయితీలు కాగా, 10మంది కుకీలు, జోలు ఉన్నారు. మహిళలందరూ కలిసి ఈ మనువాద, పితృస్వామ్య భావజాలాన్ని ఎదుర్కొవాలి. ఎవరిహక్కులు వారు కాపాడు కోవడానికి పోరాడాలి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి కైనా మణిపూర్‌ సమస్యను పరిష్కరించాలి. అన్ని పార్టీలు కలిసి మణిపూర్‌ను రక్షించుకోవలసిన బాధ్యత ఉంది.
ఈ పరిస్థితుల్లో మణిపూర్‌లో జరుగుతున్న మారణ హోమం నిజానిజాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు ప్రధాన కార్యదర్శి అనీ రాజా, జాతీయ కార్యదర్శి నిషా సింధు, అడ్వకేట్‌ దీక్ష ద్వివేదీలపై ఫైల్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌ వెంటనే ఉపసంహరించుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img