Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి రక్తపు బొట్టు ఇతరులకు ప్రాణాన్ని పోస్తుంది.. వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి రక్తపు బొట్టు ఇతరులకు ప్రాణాన్ని పోస్తుందని, ఇటువంటి రక్తదాన శిబిరాలు మరింత విస్కృతం కావాలని వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బుధవారం శ్రీ చౌడేశ్వరి సేవా సమితి ఆర్గనైజర్ బీ రే శ్రీరాములు, కమిటీ సభ్యులు ప్రసాద్, దాసరి శివా, నాగరాజు, శివయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం రక్త దాతలను పరిచయం చేసుకొని, వారిని హృదయపూర్వకంగా అభినందించారు. అనంతరం సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటువంటి రక్తదాన శిబిరాలు సమాజానికి స్ఫూర్తిగా మారాలని, రక్తం ప్రతి ఒక్కరికి అందేలా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని తెలిపారు. రక్తదానం ఇరువురికి ప్రాణదానమవుతుందని, రక్తం ఇవ్వడంలో అపూహలు బాణాలని తెలిపారు. రక్తం ఎన్నిసార్లు? ఎన్ని నెలలకు ఇవ్వాలి? అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. మీరిచ్చే రక్తదానం తల సేమియా బాధితులకు, గర్భిణీ స్త్రీలకు, ప్రమాదంలో కొన ఊపిరితో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రీ చౌడేశ్వరి సేవా సమితి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను అభినందించారు. అనంతరం బీరే శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి రక్తదాన శిబిరాలు తాము నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని, మొత్తం ఈరోజు 62 మంది రక్తదాతలుగా రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం పార్థసారథి, శంకర్ యుగంధర్, కౌన్సిలర్లు శంకర్ తేజ, కేత లోకేష్, నీలూరి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img