Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రపంచ స్థాయి సైన్యమే లక్ష్యం

పీఎల్‌ఏకు 96ఏళ్లు` ఘనంగా చైనా ఆర్మీ డే
బీజింగ్‌ : అంతర్జాతీయ స్థాయిలో అధునాతన సైనిక దళంగా ఎదగడమే లక్ష్యమని చైనా ఆర్మీడే సందర్భంగా వక్తలు ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చైనా దౌత్య కార్యాలయాల్లో ఆర్మీడే వేడుకలు నిర్వహించారు. ఆగస్టు ఒకటో తేదీకి చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఏర్పాటు అయి 96ఏళ్లు అయింది. సైనిక పరిపాలన వ్యవస్థ, దళాల అధునికీకరణ చర్యల నడుమ 96వ వార్షికోత్సవాన్ని పీఎల్‌ఏ జరుపుకుంది. రాజధాని బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి జనరల్‌ లీ షంగ్‌ ఫు, సీపీసీ కేంద్ర సైనిక కమిషన్‌ (సీఎంసీ) సభ్యులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి షంగ్‌ ఫు మాట్లాడుతూ కొత్త శకంలో చైనా సాయుధ దళాలు మరింతగా బలపడతాయని, నైపుణ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను మెరుపర్చుకుంటాయని అన్నారు. సైన్యాన్ని ప్రపంచంలోనే శక్తిమంతమైనదిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, అందుకోసం పనులు పురోగమిస్తున్నాయని చెప్పారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రతిపాదిత అంతర్జాతీయ భద్రతా పథకం అమలునకు చైనా సైన్యం నిబద్ధతతో ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సైన్యంపరంగా సంప్రదింపులు, సహకారాన్ని, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిపారు. 2027 నాటికి పీఎల్‌ఏ నిర్దేశిత శతాబ్ది లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. కాగా, జియాంగ్జి ప్రావిన్స్‌లో చరిత్రాత్మక నగరమైన నాన్‌చాంగ్‌లోని బయీ స్క్వేర్‌లో 96వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే బేయి స్క్వేర్‌ వీధుల్లోకి సందడి కనిపించింది. చైనా జాతీయ పతాకాలతో జనం రోడ్లపైకొచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. 1927 ఆగస్టు 1న చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) మొదటిసారి కౌమింటాంగ్‌ కౌంటర్‌ రివల్యూషనరీస్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు తెరతీసింది. ఫలితంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆవిర్భరించింది. కాబట్టి ఆగస్టు ఒకటో తేదీన ఆర్మీడే జరుపుకోవడం ఆనవాయితీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img