Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆర్టికల్‌ 370పై సుప్రీం విచారణ ప్రారంభం

న్యూదిల్లీ : జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ప్రారంభించింది. ఈ పిటిషన్లపై విచారణను సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిక్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవారు, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 370పై విచారణను చారిత్రమైనదిగా వర్ణించారు. 370పై విచారణకు ఐదేళ్లు పట్టిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రజాస్వామ్యం నాశనమైందని అన్నారు. తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం సాధ్యమేనా?’ అని సిబల్‌ ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్‌ 2018, జూన్‌ 28న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా అసెంబ్లీని సస్పెండ్‌ చేయాలని నిర్ణయించుకున్నారా? ఆర్టికల్‌ 365ని ఉపయోగించే ముందు 2018, జూన్‌ 21న అసెంబ్లీని రద్దు చేసి ఉండవచ్చు. ఈ సమస్యలు ఎప్పుడూ లేవనెత్తలేదు. వాటిపై ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. అందుకే ఇది చారిత్రాత్మక విచారణ’ అని సిబల్‌ వాదించారు. తన వాదనల కోసం సిబల్‌ 10 గంటల సమయం కేటాయించనున్నారు.ఈ కేసుపై మరికొన్ని రోజులపాటు విచారణ జరిగే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌, ఆర్టికల్‌ 35ఏను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ 20కంటే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img