Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్వేష రాజకీయాల ఉచ్చులో చిక్కుకోవద్దు

. దేశ ప్రజలకు సీపీఐ పిలుపు
. బీజేపీ పాలనలో భవిష్యత్‌ పరిస్థితులకు అద్దంపట్టేలా మణిపూర్‌, హరియాణా అల్లర్లని వ్యాఖ్య
. హరియాణా అల్లర్లు, రైలు ప్రయాణికుల హత్యలకు ఖండన

న్యూదిల్లీ : బీజేపీ పాలన కొనసాగితే భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేదానికి మణిపూర్‌, హరియాణా రాష్ట్రాలోని పరిస్థితులు అద్దం పడుతున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హెచ్చరించింది. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేష రాజకీయాలకు, భయోత్పాతానికి, హింసకు బలి కావద్దని, వాటి ఉచ్చులో చిక్కుకోవద్దని భారతీయులందరినీ విన్నవించింది. హరియాణాలో హింసకు కారణమైన వారిని ఉపేక్షించరాదని, బాధితులకు సముచిత పరిహారం ఇవ్వాలని బుధవారం ఒక ప్రకటనలో (సీపీఐ) జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసింది. భారత్‌లోని సమ్మిళిత సంస్కృతి, ఐక్యతను పరిరక్షించాలని, శాంతి స్థాపన, సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు కట్టుబడాలని పిలుపునిచ్చింది. హరియాణాలో అల్లర్లు, జైపూర్‌ముంబై రైల్లో ప్రయాణికుల హత్యలను సీపీఐ తీవ్రంగా ఖండిరచింది. వాస్తవ పరిస్థితులను పక్కదారి పట్టించేలా ఆ ఘటనల చిత్రీకరణ ఉన్నట్లు తెలిపింది. హరియాణాలో జరిగిన హింసలో ఇద్దరు హోంగార్డులు, ఇమామ్‌ సహా ఆరుగురు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కరడుగట్టిన హంతకుడు మోను మానేశర్‌ను ఐదు నెలలు గడిచినా అరెస్టు చేయడంలో హరియాణా పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టింది. బ్రిజ్‌ మండల్‌ ధార్మిక్‌ యాత్రలో పాల్గొంటానని ప్రకటించడమే నూప్‌ాలో అల్లర్లకు దారితీసిందని పేర్కొంది. ముస్లింల ప్రాంతాల గుండా యాత్రకు అనుమతిస్తే మతహింస జరగవచ్చని జిల్లా ఇంటెలిజెన్స్‌ అధ్యక్షుడు హెచ్చరికలు చేసినాగానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, తగు విధంగా చర్యలు తీసుకోకపోవడం ఆక్షేపణీయమని సీపీఐ పేర్కొంది. అధికార బీజేపీ విభజన రాజకీయాలతోనే మతఘర్షణలు జరిగాయని, ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img