విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని అమ్మపాలెం అంగన్వాడీ కేంద్రం నందు సీఢీపీఓ శర్మిష్ట,స్థానిక సర్పంచ్ చెన్నెబోయిన ఓబులుకొండయ్య, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కె.సునీత,వి.లలితకుమారి ఆధ్వర్యంలో గురువారం తల్లిపాల వారోత్సవాలలో భాగంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను అంగన్వాడీ కేంద్రం సంబంధించిన గర్భిణులకు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపంతో కలిగే రక్త హీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు వంటి ఆనారోగ్య సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. నెలకు అవసరమయ్యే 10 రకాలైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతి, సంపూర్ణ,అనురాధ,చెంచులక్ష్మి,పాఠశాల సిబ్బంది, ఏఎన్ఎం విజయ,ఆయాలు,ఆచాలు గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.