బెంగళూరు: భారతదేశం అంతటా వర్షా కాలం కొనసాగుతున్న నేపథ్యంలో అమెజాన్ ఫ్రెష్‌లో ఆగస్టు 1 నుండి సూపర్ వేల్యూ డేస్ ప్రారంభమయ్యాయి. ఇది 7 ఆగస్ట్, 2023 వరకు కొనసాగుతుంది. ఆగస్ట్ మెగా ఫెస్టివల్ సమయంలో పొందడానికి కస్టమర్స్ కోసం అమేజాన్ ఫ్రెష్ ఉత్తేజభరితమైన ఆఫర్స్‌ను ప్రారంభించింది. సుమారు రూ. 1 లక్ష విలువ గల బహుమతి గెలవడానికి షాపింగ్ చేయవచ్చు. కస్టమర్స్ తమకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించవచ్చు, నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పర్శనల్ కేర్, బేబీ, పెట్ కేర్ ఉత్పత్తులపై 45% వరకు తగ్గింపుతో కిరాణా, నిత్యావసరాలు కోసం ఇబ్బంది లేకుండా షాపింగ్ చేయవచ్చు. నెలకు అవసరమైన వాటిని కూడా వారు నిల్వ చేయవచ్చు.