Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనెల 9న చంద్రబాబు తోటపళ్లి సాగునీటి ప్రోజెక్టు సందర్శనను విజయవంతం చేయండి

టీడీపి పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు, అశోకగజపతిరాజులు
విశాలాంధ్ర – పార్వతీపురం : టీడీపి జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు ఈనెల 9న మన్యంజిల్లాల్లోని తోటపల్లి సాగునీటిప్రాజెక్టు సందర్శనకు వస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాష్ట్ర టీడీపీ అద్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోకగజపతిరాజులు పిలుపునిచ్చారు.శనివారం పార్వతీపురం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో విజయనగరం,పార్వతీపురం మన్యంజిల్లాల టీడీపి ఇంచార్జిలు, టీడీపి క్రియాశీలక నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైపల్యం చెందినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి అన్ని పథకాలను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టీడీపి బలోపేతాన్ని ఓర్వలేక వైఎస్సార్సీపీనేతలు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఒక అవకాశమని చెప్పి అధికారాన్ని కైవసం చేసుకున్న జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఈనెల 8న విజయనగరంకు చంద్రబాబు వస్తారని, అక్కడ మేధావులతో, పార్టీనేతలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అదేరోజు రాత్రి బస విజయనగరంలో చేస్తారని తెలిపారు.9న విజయనగరం నుండి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం గుండా వయా గజపతినగరం,బొబ్బిలి,
పార్వతీపురం మీదుగా తోటపల్లికు సాయంత్రం మూడున్నర గంటలకు చేరుకొని తోటపల్లి సాగునీటి ప్రాజెక్టును సందర్శన చేస్తారని తెలిపారు.అనంతరం అక్కడ నుండి వెనుకకు వచ్చి ఉల్లిభద్రలో రైతులతోను, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అక్కడనుండి రోడ్ షో ద్వారా పార్వతీపురం వస్తారని తెలిపారు.పార్వతీపురం నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగసభ ఉంటుందని తెలిపారు.ఆరోజు పార్వతీపురంలో రాత్రిబస చేస్తారనితెలిపారు.
పార్వతీపురంలో మేధావులతో, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల క్రియాశీలక నేతలు, నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల 10న పార్వతీపురంలో మధ్యాహ్నం బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం వెళ్తారని చెప్పారు. ఈకార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని టీడీపీ ఇంచార్జిలు, క్రియాశీలక నేతలు, మాజీఎమ్మెల్యేలతో పాటు టిడిపి రాష్ట్ర పార్టీలో ఉత్తరాంధ్ర వ్యవహారాల పరిశీలకులు సత్యనారాయణ,పోలిట్ బ్యూరోసభ్యులు, మన్యం జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి, టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఇంచార్జిలు బోనెల విజయ్ చంద్ర, తోయక జగదీశ్వరి,జయకృష్ణ, సాలూరు మాజీ ఎమ్మెల్యే భంజదేవ్, నాలుగు నియోజకవర్గాల నేతలు, అభిమానులు పాల్గొన్నారు.అనంతరం వారంతా పార్వతీపురం టీడీపీ మాజీఎమ్మెల్యే, మాజీ నియోజకవర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు అస్వస్థతకు గురైనట్టు తెలుసుకొని ఆయన ఇంటికి కృష్ణపల్లి వెళ్లి పరామర్శ చేశారు. అక్కడ నుండి నేరుగా తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు సందర్శనతోపాటు ఉల్లిభద్రను పరిశీలించారు. చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసికట్టుగా ఉండి ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img