విశాలాంధ్ర – పెనుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో సుమారు 55 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ/ పదోన్నతులు పొంది ఉన్నారు. కానీ వారి జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నందువల్ల ఏపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ వారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమలో భాగంగా డిప్యూటీ ఎమ్మార్వో దర్బార్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు మండల అధ్యక్షుల రుద్రేష్, రామాంజినేయులు ,రఘునాథ రావు, నాయకులు అమీర్వలి, రఘునాథ్, చంద్రశేఖర్, గోపాల్, వెంకటేష్, చంద్రశేఖర్, ప్రభాకర్,శ్రీనివాసులు,రాజశేఖర్, ప్రభాకర్ పాల్గొన్నారు.