Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వంటింటికి ధరల సెగ

. బెంబేలెత్తిస్తున్న బియ్యం ధరలు
. పప్పులు, పిండి ధరలూ పైపైకి…
. పాల ఉత్పత్తుల ధరలూ అంతే
. టమాటా సరసనే ఇతర కూరగాయలు

న్యూదిల్లీ: వంటిల్లు చిన్నబోయింది. వంటకాల ఘుమఘుమలు లేనేలేవు. నెలకు సరిపడా నిండుగా ఉండాల్సిన పప్పు, ఉప్పు, పిండి, ఇతరత్రా సరుకులూ అరకొరే. పాలు తాగడాన్ని పక్కనబెడితే కాఫీ, టీలకూ కొద్దిగానే వాడుకోవల్సిన దుస్థితి. ఇక కూరల సంగతి సరేసరి. టమాటా ధర తారస్థాయికి చేరి ప్రజలను ఠారెత్తిస్తుండగా, దాని సరసనే ఇతర కూరగాయల ధరలు చేరాయి. ఆకు కూరల ధరలు సైతం పెరిగిపోయాయి. అల్పాహారం కోసం వాడే మినపపప్పు, రవ్వలు, శనగపప్పు ధరలు పరుగులు తీస్తున్నాయి. వాటి సంగతలా ఉంటే బియ్యం ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆహార పదార్థాల ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌ను దెబ్బతీసింది. వర్షపాతం కారణంగా తగినంత సరఫరా లేకపోవడంతో టమాటా ధరలు గణనీయంగా పెరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ బంగాళాదుంపలు మినహా ఇతర కీలకమైన ఆహార పదార్థాల ధరలు సైతం గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వారం పార్లమెంటుకు తెలియజేసింది. కంది పప్పు ధరలు అత్యధికంగా 28 శాతం పెరిగాయి. తర్వాత బియ్యం (10.5 శాతం), మినపపప్పు, ఆటా (రెండూ 8 శాతం) ఉన్నాయి. గురువారం నాటికి కిలో బియ్యం సగటు చిల్లర ధర రూ.41 ఉండగా, అంతకుముందు ఏడాది రూ.37 గా ఉంది. దేశీయ ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా పప్పు ధరలు పెరగడానికి కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2022-23 పంట సంవత్సరానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన మూడవ అధునాతన అంచనా ప్రకారం 34.3 లక్షల టన్నుల పప్పు ఉత్పత్తిని అంచనా వేసింది. ఇది మునుపటి పంట సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన 42.2 లక్షల టన్నుల నుంచి తగ్గింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధరల పర్యవేక్షణ విభాగం ప్రకారం, బంగాళదుంపల సగటు రిటైల్‌ ధర గత సంవత్సరం కంటే 12 శాతం తక్కువగా ఉంది. ఉల్లి ధరలు గత సంవత్సరం కంటే సుమారు 5 శాతం పెరిగాయి. టమాటా ధరలకు సంబంధించి, సీజనల్‌ పంటల విధానాలు, కోలార్‌లో తెల్ల ఈగ వ్యాధి వ్యాప్తి, ఉత్తర ప్రాంతంలో అకస్మాత్తుగా రుతుపవనాల వర్షం హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లలో టమాటా పంటలపై ప్రభావం చూపడం, భారీ వర్షపాతం కారణంగా కొన్ని ప్రాంతాలలో రవాణా అంతరాయాలు వంటి కారణాల కలయిక వల్ల ఇటీవలి పెరుగుదల జరిగిందని మంత్రిత్వ శాఖ వివరించింది. గత ఏడాది కిలో రూ.34 గా ఉన్న టమాటా ధర గురువారం సగటున కిలో రూ.140 గా ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అత్యధికంగా టమాటా ధర ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కిలో రూ.257 కాగా, దిల్లీలో రూ.213, ముంబైలో కిలో రూ.157 గా నమోదయింది. డెహ్రాడూన్‌లో టమాటాతో సహా కూరగాయల ధరలు కిలోకు రూ.300 వరకు పెరగడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోదీ సర్కార్‌ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే…
భారతదేశ ఆహార ధరల ద్రవ్యోల్బణం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రాణసంకటంగా మారింది. కేంద్రం అస్తవ్యవస్థ ఆర్థిక విధానాలే ఇందుకు ప్రధాన కారణమని వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది కీలకమైన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బియ్యం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. 69 ఏళ్ల అహ్మద్‌, దాదాపు 30 సంవత్సరాలుగా బియ్యం మిల్లింగ్‌ చేస్తున్నాడు. ‘నాతో సహా అత్యల్ప నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న ప్రతి ఒక్కరూ అధిక ధరలకు బాధపడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సీజన్‌ ఆహార మార్కెట్లకు గందరగోళంగా ఉంది. గత నెల నుంచి తొలకరి వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాటా ధరలు సుమారు 400 శాతం పెరిగాయి. గత ఏడాది కంటే బియ్యం ధర 11.5 శాతం పెరిగింది. ‘కొనుగోలు చేయడం ఎలా? అదే నేను అడుగుతున్న ప్రశ్న’ అని కర్నాటక రాష్ట్రంలోని మైసూరు సమీపంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో 32 ఏళ్ల వలస కార్మికుడు జీతు సింగ్‌ అన్నారు. ‘టమాటా, బియ్యం, పప్పు అన్ని పెరిగాయి’ అని మరో దుకాణదారుడు జయలక్ష్మి మాట్లాడుతూ తన బిల్లులను భరించేందుకు పప్పులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువులపై కోత విధించినట్లు తెలిపారు.
రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చు
గత నాలుగు నెలల్లో తగ్గిన తర్వాత జూన్‌లో పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఆహార ధరల కారణంగా మరింత పెరుగుతుందని క్రిసిల్‌ బుధవారం ఒక నివేదికలో అంచనా వేసింది. జులై రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చే వారం విడుదల కానున్నాయి. తృణధాన్యాలు, పప్పులు సమీప కాలంలో కూరగాయల ధరలు కీలకంగా పర్యవేక్షిం చదగినవి. గత ఆరు నెలలుగా తృణధాన్యాల ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉంది. ప్రస్తుత ఉత్పాదక ధోరణులను పరిశీలిస్తే, పప్పు ధాన్యాలు హాని కలిగించే స్థితిలో ఉ ఉన్నాయని నివేదిక పేర్కొంది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులను పరిమితం చేయడం, గోధుమలపై నిల్వ పరిమితులను విధించడం, సరఫరాలను మెరుగుపరచడానికి ఇతర మార్కెట్‌ జోక్యాలు వంటి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలలో ఆహార ద్రవ్యోల్బణం గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఖరీఫ్‌లో నాట్లు వేసే సమయంలో అధిక వర్షాలు కురవడం కూడా ద్రవ్యోల్బణంపై ఆందోళన పెంచింది. నాట్లు వేసే సమయంలోనే అధిక వర్షాలు కురియడంతో అదనపు నీటిని ఒడిసిపట్టేందుకు రైతులు నాట్లు వేయడంలో జాప్యం చేసినట్లు తెలుస్తోంది. నష్టంపై అధికారిక అంచనాలు వేచి ఉన్నప్పటికీ, విత్తిన పంటలు దెబ్బతిన్నాయని క్రిసిల్‌ నివేదిక పేర్కొంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img