Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బోగస్ ఓట్లు లేకుండా గట్టి చర్యలు చేపడతాం.. ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డ్ గుర్తింపు కార్డు ఉండేలా తగిన చర్యలు తీసుకుంటూ బోగస్ ఓట్లు లేకుండా గట్టి చర్యలు చేపడతామని ఆర్డిఓ తిప్పే నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమును నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటా ఓటర్ సర్వే కార్యక్రమంపై సమీక్ష తోపాటు ప్రగతి వివరాలను రాజకీయ పార్టీ నాయకులకు ఆర్డీవో వివరించారు. సమావేశంలో రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఓటర్ సర్వే ఓటర్ సర్వే కార్యక్రమములో బిఎల్వోలు కీలకపాత్ర వహించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఫారం-6 ద్వారా ఓటర్ను నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీనిపైన అందరూ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో7/8/2023 నాటికి 97,370 ఇళ్లను బిఎల్ఓ, బిఎల్ఎ ద్వారా సర్వే నిర్వహించామని, ఇందులో 40,383 మంది ఓటర్లను విచారణ సర్వే(42 శాతము) పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో514 మంది నూతన ఓటర్లుగా,97 తొలగింపులుగా,685 సవరణలు బదిలీలుగా చేయడం జరిగిందన్నారు. ఈ సర్వే నిర్వాహణ కార్యక్రమం ఈనెల 20వ తేదీ వరకు పగడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 2,34,172 ఓటర్లకు గాను 98,627 ఓట్లను సర్వేలో విచారణ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, నాలుగు మండలాల తాసిల్దార్లు, ఎన్నికల ఉప తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి, సిబ్బంది రాజకుమార్, బిజెపి, టిడిపి, టిడిపి, సిపిఎం, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img