Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పోలవరం ప్రశ్నార్థకం

. నిర్వాసితులను నీటముంచిన జగన్‌
. వైద్య కళాశాలల్లో పేదలకు మొండిచెయ్యి
. రాష్ట్రానికి జగన్‌ ప్రభుత్వం అన్యాయం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-తిరుపతి : పోలవరం నిర్మాణం పూర్తికావడం ప్రశ్నార్థకమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరులతో రామకృష్ణ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తు నిర్మాణం జరగాల్సి ఉందని, 45.72 అడుగులకు ఎత్తు తగ్గించి నిర్మాణం చేస్తే ప్రయోజనం ఉండదని రామకృష్ణ చెప్పారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగించారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్రానికి వ్యయం తగ్గించడానికి సీఎం జగన్‌ నానాతంటాలు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత నిర్ణయంపై జగన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్‌ చేతకానితనం, పిరికితనం వల్ల పోలవరం పూర్తిస్థాయి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. జగన్‌ అమరావతిని ధ్వంసం చేయడమే కాకుండా పోలవరం నిర్మాణంపైనా చేతులెత్తేశారని రామకృష్ణ విమర్శించారు. పోలవరం ఎత్తు 150 అడుగులు ఉంటే 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలకు సమృద్ధిగా నీరు అందజేయవచ్చని చెప్పారు. 940 మెగావాట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చాన్నారు. ముంపు నిర్వాసితులకు దొంగ మాటలు చెప్పి పరిహారం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పోలవరం భవితవ్యంపై ఈ నెల 23న ఏలూరులో రైతుసంఘాలు, నీటిపారుదల రంగ నిపుణులు, వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ఐదు వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయని, త్వరలో మరికొన్ని రానున్నాయని తెలిపారు.
వైద్య సీట్లను రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించాలని, అలాకాకుండా ఇష్టానుసారం సీట్లు కేటాయిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన 107, 108 జీవోల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేం దుకు సీపీఐ బస్సుయాత్ర తలపెట్టిందని, ఈనెల 17న విశాఖలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర సెప్టెంబర్‌ 8 వరకు కొనసాగుతుందని తెలిపారు. సెప్టెంబర్‌ 8వ తేదీ ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నదియా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img