Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

‘చిరు’ దుమారం !

. సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటారా : బొత్స
. ముందు మీ తమ్ముడికి జ్ఞానబోధ చేయండి : అమర్‌నాథ్‌
. కేంద్ర మంత్రిగా ప్రత్యేక హోదాపై అప్పుడేం చేశారు : పేర్ని
. పగోడిగాళ్లు కూడా ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు : కొడాలి
. ప్రభుత్వానికి సరిగ్గా గడ్డిపెట్టారు : వైసీపీ ఎంపీ రఘురామ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, సినిమా గురించి ఎందుకని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారంటూ హితవు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారంటూ వ్యాఖ్యానించారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏనాడూ లేని విధంగా చిరంజీవి అకస్మాత్తుగా ప్రభుత్వ పని తీరును విమర్శిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ల వివాదం పరిష్కారం కోసం స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయిన చిరంజీవి ఇప్పుడు ఒక్కసారిగా అడ్డం తిరగడంతో అధికార పార్టీ ఇరుకున పడిరది. చిరంజీవి వ్యాఖ్యలు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం వెంటనే చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన మంత్రులను రంగంలోకి దించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని తదితరులు ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్లు పెట్టి చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని ఒప్పుకున్నారా?, చిరంజీవి సమాధానం చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని, అటువంటప్పుడు చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో ఆయనే చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తోందని, చిరంజీవి వ్యాఖ్యలను మొత్తం చూసిన తరువాత పూర్తి స్థాయిలో స్పందిస్తామని బొత్స అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందిస్తూ… చిరంజీవి మా కంటే ముందుగా వాళ్ల తమ్ముడికి జ్ఞానబోధ చేయాలి. తమ్ముడిని శుభ్రం చేసిన తర్వాత రాజకీయ పార్టీలకు సూచనలు చేస్తే బావుంటుందంటూ వ్యంగ్యంగా విమర్శించారు. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వారంటే తమకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెబుతూ… అసలు సినిమాల్లోకి రాజకీయాలను తీసుకువచ్చింది ఎవరో చెప్పండి. మంత్రి అంబటి రాంబాబుని సినిమాలో ఒక క్యారెక్టర్‌గా పెట్టారు. దానిపై ఎందుకు మాట్లాడరని మంత్రి చిరంజీవిని నిలదీశారు. ఇక మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ నుంచి ఏపీ సచివాలయం ఎంత దూరమో ఇక్కడ నుంచి ఫిల్మ్‌ నగర్‌ కూడా అంతే దూరం అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటి వరకు సినిమా హీరోలపై మాట్లాడిరదా? అని పేర్ని ప్రశ్నించారు. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారని, అటువంటప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదంటూ చిరుకు పేర్ని హెచ్చరికలు పంపారు. గిల్లితే గిల్లించుకోవాలని, సినిమాలో చెప్పినట్టు ఉండదని, బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు మళ్లీ గిల్లుతారని హెచ్చరించారు. రాజకీయాలంటే సినిమా కాదని చిరంజీవికి గుర్తు చేశారు. సినిమాలో మంత్రి గురించి పాత్ర పెట్టినందునే ఇలా కామెంట్స్‌ వస్తున్నాయని, చిరంజీవి రెమ్యునరేషన్‌ గురించి ఎవరైనా మాట్లాడారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై ఏం చేశారని, ఇప్పుడు దానిపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి కొడాలి నాని సినీ పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లున్నారు, వాళ్లు కూడా ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలిస్తున్నారంటూ పరోక్షంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఇక వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. ప్రభుత్వంపై చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారని కితాబునిచ్చారు. సినిమాల గురించి కాకుండా పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బాగా గడ్డి పెట్టారని, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చిరంజీవి వ్యాఖ్యలు ప్రశంసనీయం అంటూ రఘురామ కొనియాడారు. ఇలా మొత్తానికి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంలో, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img