Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర- ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 80% రాయితీతో ఇస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను మీ మీ రైతు భరోసా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకుని లబ్ది పొంది సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ వ్యవసాయ శాఖ డివిజన్ ఏడిఏ పద్మజ తెలిపారు. బుధవారం ఉరవకొండ మండలం మోపిడి, రాకెట్ల గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి శుభకరతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో వారు ముఖాముఖిగా మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ సలహాలు సూచనలు ఇచ్చారు. రైతులకు కావలసినంత ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా రాకెట్ల రైతు పోతప్ప కు చెందిన పొలంబడి క్షేత్రాన్ని మండల వ్యవసాయ అధికారి శుభకర్ మరియు పెన్నహోబిలం ఆలయ చైర్మన్ అశోక్ మరియు రైతులతో కలిసి పరిశీలించి పొలంబడి యొక్క ఆవశ్యకతను రైతులకు వివరించడమైనది పొలంబడి ప్రయోగంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందవచ్చని అదేవిధంగా రసాయనాలు లేని ఆహారాన్ని అందించిన వారవుతామని అశోక్ తెలిపారు. శుభకర్ మాట్లాడుతూ రేపటి నుంచి ఖరీఫ్ పంట నమోదు మొదలవ్వబోతోంది రైతులు వేసిన పంటలను మీ మీ ఆర్బికేల ద్వారా నమోదు చేసుకోవాలని తద్వారా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చు లబ్ధిని పొందగలరని తెలిపారు కార్యక్రమంలో రాకెట్ల దయ్యాల నాగరాజు మరియు రైతులైన నెట్టెం సురేష్ ,తలారి వన్నూరప్ప ,పఠాన్ భాష ,శ్రీనివాసులు నాయక్, ఎల్ ఓబులప్ప, కడదర బెంచి ఎల్లప్ప, బోయ రాజ్ కుమార్, కురుబ లింగప్ప, ఆర్ బి కే సిబ్బంది రామ్మూర్తి, పరిమళ ,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img