Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వికటాట్టహాసం చేస్తున్న విద్వేషం

బీజేపీ నాయకత్వంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంచేపట్టిన తర్వాత విద్వేషం, విధ్వంసం వికటాట్ట హాసం చేస్తున్నాయి.దేశంలో ఏ ఎన్నికలు జరిగినా హింసా యుత ఘర్షణలు జరుగుతున్నాయి. సమాజ విభజనను బీజేపీ ప్రభుత్వం దాదాపు శాశ్వతం చేసింది. దాదాపు మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు జాతుల మధ్య పోరాటం, విధ్వంసం విచ్చలవిడిగా సాగాయి. కంచే చేను మేసిన చందంగా పాలకులే మణిపూర్‌ కల్లోలానికి కారణమ య్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. శాంతి భద్రతలు కాపాడవలసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిష్క్రియాపరత్వంగా ఉంది. ఇప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం లేదు. మణిపూర్‌ కొండ కోనల్లో నివసించే కుకీ గిరిజనులను వెళ్లగొట్టి అక్కడున్న విలువైన ఖనిజ నిక్షేపాలను తవ్వుకు నేందుకు కార్పొరేట్లకు అప్పగించడానికి వీలుగా అటవీ పరిరక్షణ చట్టాన్ని సైతం సవరించారు. ఇక తాజాగా హరియాణాలో విద్వేషపు చిచ్చురేగింది. శోభయాత్ర పేరుతో విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు మసీదు ఎదుట నిల్చొని ముస్లింలను రెచ్చగొట్టారని దీంతో అల్లర్లు చెలరేగాయన్నది వాస్తవం. అయితే ముస్లింలు ప్రతిఘటించారని తెలుస్తోంది. నూప్‌ా, గురుగ్రాం ప్రాంతాలలో అల్లర్లు జరిగాయి. ఏడుగురు చనిపోయారని, వీరిలో మసీదులో సమాజ్‌ చేసే మత గురువు చనిపోయారని, రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని, విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ కార్యకర్తల ప్రదర్శనను అనుమతించాక కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఉంటే విద్వేషం, విధ్వంసం చోటు చేసుకోకుండా ఉండేవి. మత ప్రదర్శనకు ముందే సోషల్‌మీడియా హెచ్చరిస్తూ వీడియోను ప్రసారం చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అల్లర్లు జరిగాయని హింసాకాండ జరగడానికి ముందు పరిణామాల క్రమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ముందే తెలిసినా ఎందుకు నివారణ చర్యలు తీసుకో లేదని ముఖ్యమంత్రి ఖట్టరు సమాధానమివ్వాలి. ఎన్నికలకు ముందు అల్లర్లకు ముందుగా పథకం రూపొందించుకొని అమలు జరిపేందుకు ఈ విద్వేషపు, విచ్ఛిన్నకర శక్తులు రెడీగా ఉంటాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఇందుకు భిన్నంగా ఆలోచించి ఉంటే రెండు మతాల ప్రజల మధ్య హింసాయుత ఘర్షణలు జరిగి ఉండేవి కావు. ఈ ఏడాది చివరిలో మూడు రాష్ట్రాలు` మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ ఘడ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ తక్కిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌ ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టక్కుటమారి మాయాజాలంతో బీజేపీ కూలదోసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి దర్యాప్తు సంస్థలను ధన బలాన్ని ఉపయోగించి చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలదోసి తమ ప్రభుత్వాలను బీజేపీ నెలకొల్పిన చరిత్ర ఉంది. తమవి డబల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలని ప్రచారం చేస్తున్న రాష్ట్రాల్లో మత చిచ్చు, అల్లర్లు, హింసాకాండ జరుగుతున్నది. కర్నాటకలోనూ డబల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని, ధనబలం, బుజ బలం తోనూ, మెజారిటీ హిందువులను ఆకట్టుకొని మాయో పాయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేపీ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పు కున్నది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి దేశంలోనే అత్యధిక అవినీతి ప్రభుత్వం అన్న ‘‘ఘనత’’ సాధించారు. ఫలితంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఈ విషయాలను కావాలని మరిచినట్టు నటిస్తున్న బీజేపీ నాయకుల ప్రచారాన్ని ఎలా నమ్ము తారు? హరియాణాలోని నూప్‌ా నగరంలో గురువారం అర్ధరాత్రి కూడా రెండు మసీదులపై దాడిచేసి విధ్వంసం చేశారు. గతంలో విధ్వంస కాండలో ముఖ్య నిందితులైన బజరంగ్‌దళ్‌ నాయకులు మోనుమనెసర్‌, బిట్టు బజంగిలు తాజా అల్లర్లకు కుట్రలు పన్నారు. నకిలీ వీడియో తీసి దోషులు ముస్లింలన్నట్టు ప్రచారం చేశారు. వీరిద్దరు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నారని పోలీసులు చెప్తున్నారు. కేసును ఎటైనా మార్చే శక్తి పోలీసులకూ ఉంటుంది. తాజాగా జరిగిన హింసాకాండ అల్లర్లకు ముందు ఫిబ్రవరిలో జరిగిన దాడులకు గురైన ఇద్దరు వ్యాపారుల మృతదేహాలు ఇప్పుడు భివానిలో కనిపించాయని పోలీసులు చెప్తున్నారు. వీరిని అపహరించు కుపోయి చంపేశారని పోలీసులు అంటున్నారు. విద్వేష ప్రసంగాలు చేస్తే పోలీసులు తమంతట తామే కేసులు నమోదుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు, విధ్వంసాలు ఆగడంలేదు. విద్వేష ప్రసంగాలు నివారించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది కానీ మైనారిటీలపై విషం గక్కడం ఆగడంలేదు. మణిపూర్‌, హరియా ణాలలో చోటు చేసుకున్న హింసాకాండ, అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరింప చేయాలన్న కుట్ర కూడా ఉందని వార్తలు వచ్చాయి. దేశంలో అల్లర్లు, అశాంతి నెలకొని ఉన్న సమయంలోనూ మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూడవ స్థానంలో ఉంటుందని మోదీ తదితర నాయకులు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా ఆర్థిక వృద్ధి రానున్న కాలంలోనూ మాంద్యంలో ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్‌లు అంచనా వేశాయి. ఒకవైపు దేశంలో 25 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని అనేక సర్వేలు చెప్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం పేదరికం ఎక్కడుందని ప్రశ్నిస్తోంది. పేదరికం లేకపోతే 80 కోట్ల మందికి ధాన్యం అందిస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ, సంఫ్‌ు పరివార్‌, దాని అనుబంధ సంస్థలకు విడదీయలేని సంబంధాలున్నాయి. అందువల్లనే కుట్రలు, విధ్వంసా లకు కారణమైన సంస్థలపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహిస్తున్నాయన్న తీవ్ర విమర్శలను బీజేపీ ఎదుర్కొంటోంది. సంఫ్‌ు పరివార్‌, దాని తోక సంస్థలు గోరక్షణ పేరుతో అనేకమంది మైనారిటీలను హతమార్చారు. మనది ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ అని రాజ్యాంగంలో రాసుకున్నాము. అన్ని వ్యవస్థలను మోదీ తన అధీ నంలోకి తెచ్చుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలననుసరిస్తూ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టాలని బీజేపీ కంకణం కట్టుకుంది. వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు అప్పగించి రైతులను కూలీలుగా మార్చేందుకు ప్రయత్నించారు. రైతులు సంవత్సరం పైగా వీరోచిత పోరాటం చేయడంతో ప్రస్తుతానికి ముప్పు తప్పింది. ఇప్పుడు 2024లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని కావడానికి మోదీ అబద్దాల ప్రచారాన్ని మారుమోగిస్తున్నారు. స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా సంక్షేమాన్ని రక్షించుకోవాలంటే కేంద్ర పాలకుల ఎత్తుగడలను చిత్తుచేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నెలకొల్పాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img