London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మోదీ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ

ప్రధానమంత్రి మోదీ సర్కారుకు సోమవారం నాడు సుప్రీం కోర్టు నుంచి నాల్గవసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన సంఘటనపై జులై 19న వీడియో బయటకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ పనితీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఎండగట్టారు. మణిపూర్‌ హింసను నిలిపివేయడానికి వారం రోజుల్లోగా చర్య తీసుకోండి, లేకపోతే మేమే చర్య తీసుకోవలసి వస్తుంది అని చురక అంటించారు. మణిపూర్‌ సంఘటన జరుగుతున్న సందర్భంగా విచారణక్రమంలో మణిపూర్‌ పోలీసులు శాంతి భద్రతలను, హింసాంత్మక ఘటనలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని రెండోసారి అత్యున్నత న్యాయస్థానం చురక అంటించింది. మణిపూర్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ఏడోతేదీన స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. మణిపూర్‌లో మొత్తం వ్యవస్థ కుప్పకూలిందని, రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన సాగడంలేదని కూడా అత్యున్నత న్యాయస్థానం దుయ్యబట్టింది. ఇది మూడవ ఎదురుదెబ్బ అనుకోవచ్చు. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన తరవాత ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయడానికి ఇంత జాప్యం ఎందుకు జరిగిందని కూడా నిలదీసింది. ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేసిన తరవాత కూడా నిందితులను అరెస్టు చేయడానికి అంతకాలం ఎందుకు పట్టిందని కూడా నిగ్గదీసింది. ప్రధాన న్యాయమూర్తి మణిపూర్‌కు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించి ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేశారు. ఈ వ్యవహారంలో విచారణ జరుగు తున్నప్పుడు అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సోలిసిటర్‌ జనరల్‌ కూడా ప్రధానన్యాయమూర్తి ఎదుట ఉన్నారు. చంద్రచూడ్‌ అడిగిన ప్రశ్నలకు వారిద్దరూ ఏ సమాధానం చెప్పలేక నిశ్చేష్టంగా ఉండిపోయారు. ఏడో తేదీన విచారణ సమయంలో సుప్రీంకోర్టు నాల్గవసారి చురకంటించింది. అక్కడితో ఆగకుండా రెండు విశిష్టమైన కమిటీలను ఏర్పాటు చేసింది. సీబీఐ విచారణను పర్యవేక్షించడానికి మహారాష్ట్ర మాజీ డి.జి.పి. దత్తాత్రేయ పడ్సంగీకర్‌ ను పర్యవేక్షణాధికారిగా నియమించింది. మరో వేపున ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కూడినా జ్యుడీషియల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సీబీఐ దర్యాప్తును, మణిపూర్‌ పోలీసుల దర్యాప్తును కూడా పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిత్తల్‌ నాయకత్వం వహిస్తారు. మాజీ న్యాయముర్తులు శాలినీ జోషీ, ఆశా మీనన్‌ కూడా ఈ కమిటీలో ఉంటారు. న్యాయమూర్తులతో కూడిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు విస్తృతమైన బాధ్యతలు అప్పగించింది. వీరు జరుగుతున్న దర్యాప్తును కూలంకషంగా పరిశీలించడంతో పాటు బాధితులను ఆదుకోవడానికి తీసుకోవలసిన సహాయక చర్యలను సైతం సూచిస్తారు. బాధితులకు ఎంత పరిహారం అందించాలి, పునరావాసం ఎలా కల్పించాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేయవచ్చు. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జె.బి.పార్దీవాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన బెంచి కమిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులతో కూడిన కమిటీ సహాయక శిబిరాలను కూడా సందర్శిస్తుంది. అయితే ఈ కమిటీ సీబీఐ దర్యాప్తు మీద ఆధిపత్యం చెలాయించదని, దర్యాప్తులో జోక్యం చేసుకోదని, అయితే ప్రజలకు విచారణ, న్యాయప్రక్రియపై విశ్వాసం కల్పించవలసిన అవసరం ఉంది కనక ఈ కమిటీని నియమిస్తున్నామని సుప్రీంకోర్టు తెలియజేసింది.
మణిపూర్‌ హింసాకాండపై అనేకమంది సుప్రీంకోర్టుకు అర్జీలు పెట్టుకున్నారు. వీరిలో కుకీ-జోమీ తెగకు చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరిని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేశారు. ‘‘మా చేతిలో ఉన్నంత మేరకు చట్టబద్ధ పాలన మీద ప్రజలకు విశ్వాసం కల్పించడానికే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని సుప్రీంకోర్టు బెంచి తెలియజేసింది. మణిపూర్‌ హింసాకాండపై కేసుల విచారణను మణిపూర్‌లో కాకుండా మరో రాష్ట్రంలో నిర్వహించేట్టు చూడాలని అర్జీలు పెట్టుకున్న వారిలో కొందరు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకోలేదు. దత్తాత్రేయ పడ్సంగీకర్‌ నాయకత్వంలో ఒక పర్యవేక్షక కమిటీని, ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో న్యాయసంబంధ అంశాలను పరిశీలించే కమిటీని ఏర్పాటుచేయడం ద్వారా చట్టబద్ధత పాలన కొనసాగేలా చూడాలని ప్రయత్నిస్తోంది. సీబీఐ దర్యాప్తు సామర్థ్యాన్ని తాము ప్రశ్నించడం లేదని స్పష్టంచేసింది. ఈ రెండు కమిటీలు సుప్రీంకర్టుకు తమ నివేదికలను అందజేయాలి. సీబీఐ దర్యాప్తు సవ్యంగా జరిగేలా ఉండడానికి కూడా అత్యున్నత న్యాయస్థానం కట్టుదిట్టాలు చేసింది. కనీసం డిప్యూటీ సూపరింటెండెంట్‌ స్థాయిగల భిన్న రాష్ట్రాలకు చెందిన అయిదురుగు అధికారులు సీబీఐ దర్యాప్తులో భాగం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పోలీసులు హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందినవారై ఉండాలి. ఈ పోలీసు అధికారులను డిప్యుటేషన్‌పై సీబీఐలో నియమించాలి. వీరంతా ఎఫ్‌.ఐ.ఆర్‌.లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయితే వీరు సీబీఐ పరిపాలనా నిబంధనలకు లోబడే పనిచేయవలసి ఉంటుంది. వీరిమీద సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. సీబీఐకి బదిలీ చేయని కేసులను విచారించడానికి 42 ప్రత్యేక దర్యాప్తు బృందాలున్నాయి. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాల్లో ఇతర రాష్ట్రాల అధికారులూ ఉంటారు. వీరి పనితీరును పర్యవేక్షించే బాధ్యతను డి.ఐ.జి. స్థాయి కలిగిన ఆరుగురు అధికారులకు అప్పగించారు.
ఒక్కో డి.ఐ.జి. స్థాయి అధికారి ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నిర్దేశిస్తారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే రాజకీయపార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాభివృద్ధి సత్వరం జరుగుతుందని బీజేపీ గొప్పలు చెప్పుకుంటుంది. దీనినీ బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటున్నారు. మణిపూర్‌లో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. పైగా వరసగా రెండుసార్లు బీజేపీయే అధికారంలోకి వచ్చింది. అయినా మణిపూర్‌లో జరిగిన సంఘటనలు 2002నాటి గుజరాత మారణకాండను తలపిస్తున్నాయి.
గుజరాత్‌లో ముస్లింల మీద విరుచుకుపడి ఇప్పుడు మణిపూర్‌లో గిరిజనుల మీద విరుచుకు పడ్తున్నారు. వారు క్రైస్తవులు కావడమే దీనికి కారణం కావచ్చు. గుజరాత్‌లో ఒక వర్గానికి 2002లో బుద్ధి చెప్పిన తరవాత అక్కడ మతకలహాలు జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్తూ ఉంటారు. అంటే అక్కడ ఒకవర్గం వారంటున్న ముస్లింలను కోలుకోలేని దెబ్బతీసి, వారిని భయభ్రాంతుల్ని చేసిన రీతిలోనే క్రైస్తవులమీద కక్ష తీర్చుకుంటారేమో. సుప్రీంకోర్టు మంగళవారం తీసుకున్న చర్యలన్నీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వాదనను తుత్తినయలు చేయడానికే ఉపయోగపడ్తాయి. ప్రజలు శాంతియుతంగా జీవించే రీతిలో పని డబుల్‌ ఇంజన్‌ సర్కారు పనిచేయడంలేదన్న నిర్ధారణకు సుప్రీంకోర్టు వచ్చినట్టుంది. న్యాయమూర్తులతో కూడిన కమిటీ సహాయక శిబిరాలను కూడా సందర్శిస్తుంది. వేలాదిఇళ్లను దగ్ధం చేసినప్పుడు, సహాయక శిబిరాలలో అనేకమంది తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు డబుల్‌ సర్కార్‌ ప్రచారం ఎంత ఘోరంగా విఫలమైందో అర్థంఅవుతూనే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగనప్పుడు ఎక్కడైనా పరిపాలన విఫలమైనట్టే. దాన్ని మళ్లీ పట్టాలమిందకు ఎక్కించడానికే సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img