Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దేశంకోసం పునరంకితమవుదాం…

వీరుల త్యాగాల స్పూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి…

నాభూమి-నాదేశం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే వి.ఆర్. ఎలీజా…

విశాలాంధ్ర -లింగపాలెం: నాభూమి-నాదేశం(మేరీ మాటి-మేరా దేశ్) కార్యక్రమంలో భాగంగా దేశంకోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని దేశంకోసం పునరంకితమవుదామని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.
గురువారం లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామంలో సచివాలయ ఆవరణలో మనమట్టి-మనదేశం కార్యక్రమం కింద మట్టికి నమస్సులు-వీరులకు వందనం శిలాఫలకాన్ని ఎమ్మెల్యే వి.ఆర్. ఎలీజా, స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విద్యార్ధులు అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు.ఈ సందర్బంగా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది హర్ గర్ తిరంగా కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేశామన్నారు.అమృత్ సరోవర్ తో గ్రామాల్లో చెరువుగట్ల అభివృద్ది మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు.ఈ ఏడాది నాభూమి-నాదేశం పేరిట ఈ నెల 9వ తేదీ నుండి 20 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమాలను అన్ని గ్రామ పంచాయితీలు, మండలాలు, పట్టణ ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందన్నారు. 11వతేదీన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. 14వ తేదీన వీరులకు వందనం పేరిట దేశ సంక్షేమం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్ధానిక మహనీయులను, వీరులను స్మరించుకోవడం, మరణించిన వీరుల కుటుంబాలను, జీవించియున్న వీరులను సత్కరించే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణచేయడం జరుగుతుందన్నారు.చింతలపూడి ఎమ్మెల్యే వి.ఆర్. ఎలీజా మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో ఎందరో మహనీయుల త్యాగఫలాలను మనం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరిలో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు నామట్టి-నాదేశం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశంలో జన్మించడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ వైస్ చైర్మన్ బి. నవీన్ బాబు, యంపిడిఓ ఎస్. ఆశీర్వాదం, తహశీల్దార్ మురళీకృష్ణ, గ్రామ సర్పంచ్ రావి రమాదేవి, ఎఎంసి చైర్మన్ జానకీరెడ్డి, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్ రావు, సచివాలయ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ …

ముడిచెర్ల సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సందర్శించారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, రిజిష్టర్లను పరిశీలించారు. పలువురు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న విధులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img