Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తప్పుడు ప్రచారాలు మానండి.. పార్టీ విజయానికై పని చేయండి

పార్టీ శ్రేణులకు జడ్పిటిసి సభ్యులు బాలయ్య పిలుపు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పార్టీ కోసం పనిచేసే వారు టిక్కెట్ల కోసం ఆశించడం తప్పులేదు. పార్టీ కోసం పని చేయకుండా పైరవీలు చేసి టిక్కెట్లు ఆశించడం మంచి సంస్కృతి కాదని జెడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టాలనే దుష్ట బుద్ధితోనే పలువురు పైరవీలు చేస్తున్నారని, పనిచేసే వారు ఎవరో, పైరవీలు చేసే వారు ఎవరో ఇప్పటికే అధిష్టానం వద్ద సర్వేలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అధిష్టానం అంత ఆషామాషీగా టిక్కెట్లు కేటాయించదన్నారు. పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తే అధిష్టానమే గుర్తించి అవకాశాలు కల్పిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి పోటీ చేయాలనే ఆశ ఉండడం సహజమని, అంత మాత్రం చేత అవకాశం లేని వారు కూడా తమకే టికెట్లు కేటాయిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎవరికి టికెట్లు కేటాయించినా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రావాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు అందుకోవాలనే ఆలోచనతో శ్రేణులంతా సమిష్టిగా కృషి చేయాలని ఎవరికి టిక్కెట్టు కేటాయించినా వైకాపా విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img