Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బంగ్లాదేశ్‌లో నేడే పోలింగ్‌

. ఎన్నికల వేళ చెలరేగిన హింస
. రెండు పోలింగ్‌ బూత్‌లకు, రైలుకు నిప్పు
. నలుగురి దుర్మరణం ` అనేకమందికి గాయాలు
. బీఎన్‌పీ 48గంటల సార్వత్రిక సమ్మె

ఢాకా: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఆదివారం పోలింగ్‌ జరగనుంది. అయితే శనివారం పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన రెండు బడులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. చిట్టగాంగ్‌లోని పటేంగా ఇపిజెడ్‌ ప్రాంతంలో తెల్లవారుజామున 4.30 గంటలకు నిశ్చింత పారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని అధికారులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని గదికి నిప్పుపెట్టగా అక్కడున్న కొత్త పుస్తకాలు దగ్ధమయ్యాయని సీఎంపీ పోర్ట్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ షకీలా సోల్తానా అన్నారు. బంగ్లాదేశ్‌, భారత్‌కు సరిహద్దు పట్టణమైన బెనాపోల్‌ వద్ద ఓ ప్యాసింజర్‌ రైలుకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు దగ్దం కాగా ఓ చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ప్రయాణికుల్లో దాదాపు 292 మంది భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగివస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నలుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అగ్నిమాపక దళ అధికారి షాజహాన్‌ సికిందర్‌ చెప్పారు. ఇదిలావుంటే ఆదివారం జరగబోయే ఎన్నికలను పర్యవేక్షించేందుకు భారత్‌ నుంచి ముగ్గురు నిపుణులు ఢాకాకు చేరుకున్నారు. మరో 122 మంది కూడా ఇతర దేశాల నుంచి వచ్చారు.
అప్రమత్తంగా ఉన్నాం
మరొక ప్రాథమిక బడికి నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారని ఖుల్నా పోలీసు అధికారి సైదుర్‌ రెహమాన్‌ తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ దళాలను అప్రమత్తం చేశామన్నారు. 8,00,000 మంది పోలీసులు, పారామిలటరీ దళాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. ఎన్నికల వేళ పోలింగ్‌ బూత్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండనున్నద న్నారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా త్రివిధ దళాల అధికారులనూ మోహరించినట్లు అధికారులు తెలిపారు.
బీఎన్‌పీ 48 గంటల ఆందోళన
ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్‌పీ ఎన్నికలను బహిష్కరించింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి తటస్థమైన ఆపద్ధర్మ ప్రభుత్వం అధ్వర్యంలో ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేసింది. ఇందుకు అధికార పక్షం ఒప్పుకోలేదు. దీంతో 48 గంటల ఆందోళనకు దిగింది. బీఎన్‌పీ సీనియర్‌ అధికారి రుహుల్‌ కబీర్‌ రిజ్వి మాట్లాడుతూ బెనాపోల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేసినదిగా అధికార పక్షాన్ని ఉద్దేశించి ఆరోపించారు. మానవాళిపై క్రూరత్వంగా అభివర్ణించారు. అయితే ప్రధాన విపక్షం పోటీలో లేని కారణంగా షేక్‌ హసీనా వరుసగా నాల్గో సారి గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 436 మంది స్వతంత్రులు, 27 పార్టీల నుంచి 1,500 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img