Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నీరో చక్రవర్తి జగన్‌

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై స్పందనేది
విజయవాడ ధర్నాలో రామకృష్ణ

విశాలాంధ్ర`విజయవాడ: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్వర్యంలో 4వ రోజు శనివారం స్థానిక కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, నీరో చక్రవర్తికి తేడాలేదని ఎద్దేవా చేశారు. నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకుంటే…సీఎం మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల్లో మునిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులు రోడ్డెక్కారని ఆందోళన వ్యక్తంచేశారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశాలు, యానిమేటర్లు, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, చివరికి వలంటీర్లు సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంతమంది కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తుంటే ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించటం లేదని, ఇలాంటి మూర్ఖ శిఖామణి రాష్ట్రానికి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను పోలీసులతో అరెస్టు చేయించటం తప్ప వారిని పిలిచి మాట్లాడలేదన్నారు. సీఎం జగన్‌ చట్టాన్ని అమలు చేయటం లేదు. కోర్టు తీర్పులు గౌరవించటం లేదు. కనీసం ఆయన గతంలో చేసి వాగ్దానాలు అమలు చేయటం లేదని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి దిగివచ్చి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సీపీఐ, ఇతర వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన కార్మికులను చర్చలంటూ పిలిచి స్వయంగా మాటాడ్లటం లేదని, చర్చలు జరిపే వారికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా ఏమి మాట్లాడగలరని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించటం చేతగాని వైసీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తున్నామని వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలకు పిలిచిందని, ఒక్కసారి కూడా తాము ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరామని, సర్వీసును 62 సంవత్సరాలకు పెంచమని అడిగినా సాధ్యం కాదని తెగేసి చెప్పారన్నారు.
సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సీఎం జగన్‌ పట్టించుకోవటం లేదన్నారు. ఏఐటీయూసీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, తాడి పైడయ్య, ఏఐటీయూసీ నగర నాయకులు కొట్టు రమణరావు, వియ్యపు నాగేశ్వరరావు, దుర్గాసి రమణమ్మ, సింగరాజు సాంబశివరావు, తెడ్డు వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు జక్కి జేమ్స్‌, విక్కీ, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img