Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

న్యాయానికి విజయం

. బిల్కిస్‌ బానో కేసులో సుప్రీం తీర్పుపై విపక్షాలు
. నేరస్థులకు కేంద్రం రక్షణ కవచమని మండిపాటు
. కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

న్యూదిల్లీ: బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందిని త్వరగా విడుదల చేసేందుకు అనుమతించాలన్న గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు సోమవారం స్వాగతించాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని విపక్ష నేతలు విమర్శిం చారు. బిల్కిస్‌ బానో అవిశ్రాంత పోరాటం ‘అహంకార’ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘న్యాయం సాధించిన విజయానికి’ ప్రతీక అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఎన్నికల ప్రయోజనాల కోసం ‘న్యాయాన్ని చంపేసే’ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు ‘నేరస్తులకు పోషకుడు’ ఎవరో దేశానికి మరోసారి చాటిచెప్పింది’ అని తెలిపారు. రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ తీర్పుపై స్పందించారు. చివరికి న్యాయం గెలిచిందని అన్నారు. ‘ఈ ఉత్తర్వుతో భారతీయ జనతా పార్టీ మహిళా వ్యతిరేక విధానాలపై ఉన్న ముసుగు తొలగిపోయింది. దీని తర్వాత న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుంది. ధైర్యంగా పోరాటం కొనసాగించినందుకు బిల్కిస్‌ బానోకు అభినందనలు’ అని ఆమె ‘ఎక్స్‌’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మీడియా ప్రచార అధ్యక్షుడు పవన్‌ ఖేరా మాట్లాడుతూ గుజరాత్‌ ప్రభుత్వం 11 మంది రేపిస్టుల విడుదలను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ‘మహిళల పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేస్తుంది’ అని అన్నారు. ‘ఈ నేరస్తులను అక్రమంగా విడుదల చేయడానికి సహకరించిన వారికి, దోషులకు పూలమాల వేసి వారికి స్వీట్లు తినిపించిన వారికి ఇది చెంపదెబ్బ…’ అని ఖేరా తెలిపారు. ‘బాధితుడు లేదా నేరానికి పాల్పడిన వ్యక్తి మతం లేదా కులంపై న్యాయ నిర్వహణ బాధ్యత వహించడాన్ని భారతదేశం అనుమతించదు’ అని ఆయన చెప్పారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీం తీర్పును స్వాగతిస్తూ, మహిళా సాధికారత విషయంలో బీజేపీ చేస్తున్న ‘ఉత్త వాదనలను’ ఇది బహిర్గతం చేసిందని విమర్శించారు. ‘ఏ ప్రభుత్వమూ తమ చేతుల్లోకి తీసుకొని అటువంటి నేరస్తుల విడుదలను ఆమోదించకూడదు. అమిత్‌ షా నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు మౌనంగా ఉందో నేను అడగాలనుకుంటున్నాను. ఈ దోషులను ముందస్తుగా విడుదల చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇది చాలా స్పష్టంగా ఉంది. నారీ శక్తి (మహిళా సాధికారత) గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బూటకపు వాదనలు చేస్తున్నారు’ అని అన్నారు. బిల్కిస్‌ బానో, ఆమె కుటుంబానికి ప్రధాని మోదీ, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము’ అని తెలిపారు. ఈ తీర్పుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) స్పందిస్తూ, ‘ఈ నేరస్తుల విడుదలను సులభతరం చేసిన, దోషులను కీర్తించిన బీజేపీ ముఖం మీద చెంపదెబ్బ’ అని పేర్కొంది. రాజకీయ అజెండాల కంటే న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుంది’ అని తెలిపింది. శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది ట్వీట్‌ చేస్తూ, ‘ఎప్పటికీ మర్చిపోవద్దు. గుజరాత్‌ కోర్టు నుంచి ఉపశమనం రాకముందే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయానికి ఎన్‌వోసీ ఇచ్చింది. బిల్కిస్‌ బానో న్యాయం కోసం అత్యున్నతంగా, శక్తివంతంగా పోరాడారు’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన వంచిత్‌ బహుజన్‌ అగాది అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ ‘ఇది చట్టం సాధించిన విజయం’ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత సుప్రీం తీర్పును స్వాగతించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img