London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి విజయసాయి రెడ్డికి లేదు…

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:; జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు విజయ్ సాయి రెడ్డికి ఏమాత్రం లేదని, అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని విజయసాయి రెడ్డి పై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ దొంగ ఓట్లను చేర్పించడం అర్హత గల ఓట్లను తొలగించడం లాంటివి అధికంగా జరుగుతున్నాయని సాక్షాధారాలతో ఎన్నికల సంఘానికి విన్నవించేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే పారదర్శకత్వం కూడిన విచారణ చేపట్టి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా విజయసాయిరెడ్డి ఇష్టానుసారం వచ్చినట్లు ప్రతిపక్షాలపై మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని వారు హితవు పలికారు. జ్ఞానము, బుద్ధి పెరగలేదని, కేవలం విజయసాయిరెడ్డికి వయసు మాత్రమే పెరిగిందని వారు తెలిపారు. మా జనసేన పార్టీకి అధ్యక్షులు ఉన్నారు. మరి మీ వైయస్సార్సీపీ పార్టీకి అధ్యక్షులు ఇప్పటివరకు ఎవరు అనేది సందిగ్ధములో ఉందని వారు దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, సభల్లో ప్రతిపక్షాలను పై బురద చెల్లుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నేటి వైయస్సార్సీపి ప్రజాప్రతినిధులకు మంత్రులకు సర్వసాధారణమైందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి బుద్ధి చెబుతారో వేచి చూడండి అని జోష్యం చెప్పారు. నాడు వైఎస్ఆర్సిపి చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలను అడ్డుకట్టు వేసేందుకే ప్రతిపక్షాలు ఏక తాటిపై నిలబడి, వైయస్సార్సీపీ పార్టీని ఇంటికి పంపేందుకు ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, గట్టిగా నిలదీసి అడిగే వారిపై కేసులు పెట్టడం బెదిరించడం పద్ధతి కాదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. మరి విజయసాయిరెడ్డి ఎటు ముద్దాయిగా ఉన్నారని, నీపై మోపిన కేసులకు ఇంతవరకు ఎందుకు రుజువు చేసుకోలేకపోయావు? అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారని, ఇప్పటికే ప్రజలు అన్ని వర్గాల వారు అయిష్టంతో ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు తప్పక జరుగుతాయని వారు తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించిన కూడా భయపడేది లేదని వారు సవాల్ విసిరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై బురద చెల్లడం మానుకోవాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img