Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సంక్రాంతి పండుగ వేళ రంగుల హరివిల్లులో అయోధ్య మందిరం

ముగ్గులో చిత్రీకరణ.. డిజైనర్ నాగరాజు దంపతులు
విశాలాంధ్ర ధర్మవరం:: భారతీయ కళా వైభవాన్ని వివిధ రూపాలలో కొంతమంది కళాకారులు తమ భక్తి భావాన్ని, కలలు పెంపొందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కేశవ నగర్ లో నివసించే జుజారే నాగరాజు, జూజారే ఉషారాణి అనే దంపతులు గత 22 సంవత్సరాలుగా హిందువుల యొక్క సాంప్రదాయాలు లోని చిత్రాలను, దేశంలోని ప్రముఖ దేశ నాయకుల యొక్క చిత్రపటాలను తమదైన శైలిలో పట్టుచీరాలపై చిత్రీకరించి, తమ కలను అందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఇప్పటికే డిజైనర్ నాగరాజు దంపతులు దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాలలో మంచి గుర్తింపును పొందారు. తదుపరి ఒక మంచి ఆలోచనతో సమాజంలో నివసించే ప్రజలందరికీ అయోధ్య ను గుర్తు చేసేందుకు ఈ దంపతులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా తమ కేశవ నగర్ లోని వీధిలో మూడు మీటర్ల పొడుగునా మూడున్నర గంటల పాటు శ్రమించి ముగ్గుల రూపంలో అయోధ్య రామ మందిరం చిత్రపటాన్ని, చీర కొంగుగా రామ బాణమును, చీర బార్డర్లో జైశ్రీరామ్ అన్న తెలుగు పదాలు, మిగిలిన చీర భాగంలో దీపాలు లను ముగ్గులలో చిత్రీకరించిన వైనం ధర్మవరం ప్రజలందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ముగ్గును చూడడానికి గత మూడు రోజులుగా తరలివచ్చి మహిళలు పెద్ద ఎత్తున వీక్షించారు. హిందూ సాంప్రదాయాలను పట్టు చీరలపై కూడా కాకుండా ముగ్గులపై కూడా చిత్రీకరించడం పై పట్టణ ప్రజలు, అధికారులు, పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దంపతులకు ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ముగ్గు మూడు మీటర్ల పొడవులో చక్కటి అయోధ్య మందిరాన్ని చిత్రీకరించేందుకు వైలెట్, స్కై బ్లూ, కాసాయి, బంగారు వర్ణం, మట్టి కలర్, రోజా కలర్ లను ఉపయోగించడం జరిగిందని తెలిపారు. డిజైనర్ నాగరాజు మాట్లాడుతూ తన సతీమణి ఉషారాణి తోపాటు కుటుంబ సభ్యుల సహాయ సహకారములతో పట్టు చీరలపై గాని ముగ్గులు వేయడంలో కానీ నాకు సహకరించడం సంతోషంగా ఉందని, ఇటువంటి కలలను నాకు ఆ భగవంతుడే ప్రసాదించడం పూర్వజన్మ సుకృతంగా తాను భావిస్తున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని చిత్రాలను చిత్రీకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img