కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగన అశ్వర్థ నారాయణ.
విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోవుతున్నదని ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంగన్న అశ్వత్థ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్షురాలిగా నియమించడం శుభ పరిమాణం అని తెలిపారు. అదేవిధంగా గిడుగు రుద్రరాజును సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం సంతోషదాయకమని తెలిపారు. త్వరలో 52 మంది మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతోందని తెలిపారు. రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి పాదయాత్ర చేశారని అక్కడ కూడా మంచి అనుష స్పందన రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గానికి వైఎస్ షర్మిల అని పిలిపించి ఇక్కడ చేనేత కార్మికుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుందని, సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ నిరుద్యోగ సమస్య తదితర వాటిని పొందపరచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకోరాలేకపోయారని, రాష్ట్రానికి రాజధాని కూడా ఏర్పాటు చేయకపోవడం ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షమీవుళ్ల,మైనారిటీ పట్టణ అధ్యక్షులు కరీం, డిసిసి డైరెక్టర్ సయ్యద్ సాహిర్, జనరల్ సెక్రెటరీ మునాఫ్ లు పాల్గొన్నారు.