Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బెదిరింపులు…తిరుగుబాట్లుబెదిరింపులు…

. నారాయణస్వామి అనుచరుల నిరసన
. తేలని పిఠాపురం పంచాయితీ
. మంత్రి గుమ్మనూరు మౌనం
. మరో రెండు జాబితాలపై వైసీపీ కుస్తీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీలో అసమ్మతి నేతల తిరుగుబాట్లు, డిమాండ్లతో అధిష్ఠానానికి దిక్కుతోచడం లేదు. మార్పులు, చేర్పులతో ఇప్పటివరకు టికెట్లు దక్కని సిట్టింగులు అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్నారు. టికెట్లు ఇస్తేనే పార్టీలో ఉంటామని, లేకుంటే తమ భవిష్యత్తు తాము చూసుకుంటామని బెదిరింపులకు దిగారు. అసంతృప్తులతో వైసీపీ ఒకవైపు సంప్రదింపులు జరుపుతూనే…మరోవైపు జాబితాలపై జాబితాలు విడుదల చేస్తోంది. ఇప్పటివరకు నాలుగు విడతలుగా 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఇంకా రెండు జాబితాలు ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఐదో జాబితాలో మరో పదికిపైగా ఎంపీ స్థానాలు మార్చే అవకాశం ఉంది. మరికొన్ని ఎమ్మెల్యే స్థానాలపైనా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం, విశాఖ జిల్లాల నుంచి కొందరిని మార్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత రాకపోవడంతో మరో జాబితా జాప్యమవుతోంది. ఇన్‌చార్జిల మార్పు ప్రక్రియను ఈనెల 24లోగా పూర్తి చేసేందుకు సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. 25 నుంచి పార్టీ శ్రేణులతో ప్రాంతీయ సమావేశాలకు సీఎం సిద్ధమయ్యారు. ఐదారు జిల్లాలను కలిపి ఒకేచోట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో బొబ్బిలి నుంచి ఆయన పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు పంపండంపై చాలామంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. నారాయణస్వామిని తిరిగి అదే స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే తాము పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. నారాయణస్వామి ముద్దు, ఇతర ప్రాంతాల వారు వద్దు అని స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సీటుపై స్పష్టత రాలేదు. ఈ స్థానానికి ఎంపీ వంగా గీత పేరు ప్రకటించినా…సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సహకరించడం లేదని ఆమె సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఆమె తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. దీంతో ఎమ్మెల్యే దొరబాబును వైసీపీ అధిష్ఠానం క్యాంపు కార్యాలయానికి పిలిపించింది. వైసీపీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన కలిశారు. రాజ్యసభ సీటును తూర్పుగోదావరి జిల్లాల నుంచి కాపులకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా, ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని వారు సర్దిచెప్పారు. త్వరలోనే సీఎంను తాను కలుస్తానని దొరబాబు వెల్లడించారు. వైసీపీ మార్పులు, చేర్పులు చేసిన నియోజకవర్గాల్లో కొన్నింటిపై అధిష్ఠానం రీసర్వేకు సిద్ధమైనట్లు తెలిసింది. టికెట్లు దక్కని వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీనిని గమనించిన అధిష్ఠానం కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే రీ సర్వేకు సిద్ధమైనట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img