ఐసిడిఎస్ సిడిపిఓ రమణి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చింతపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఖాళీలు ఏర్పడిన అంగన్వాడి, మినీ అంగన్వాడి, ఆయా పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని జి వి రమణ అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 39 ప్రకారం గిరిజన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ (పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లు) పరిధిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చింతపల్లి ప్రాజెక్టు పరిధిలో ఖాళీలు ఏర్పడిన చిట్రాల గొప్పు అంగన్వాడి కార్యకర్త, పెద అంతర్ల మినీ అంగన్వాడీ కార్యకర్త, చెరువు వీధిలో ఆయా పోస్టులకు గాను నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పోస్టులకు గాను గిరిజనులైవుండి పదవ తరగతి ఉత్తీర్ణులైన 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకై స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని ఆమె కోరారు.