చింతపట్ల సుదర్శన్
‘లంచ్ టైం’ కావడంతో మాంసం దుకాణానికి బయలుదేరింది డాగీ. ఈ రోజు గ్రహాలు అనుకూలంగా ఉంటే కడుపు నిండుతుందని ఆశపడుతూ. దుకాణానికి ఎదురుగ్గా తనలాగే గ్రహాలమీద నమ్మకం పెట్టుకుని కూచున్నవి మరో రెండు దిక్కులేని కుక్కలు. గ్రహాలు ఎప్పుడూ ఒక్కచోట కుదురుగ్గా ఉండవు కదా. నిన్న బాగానే ఉన్నాయి. కడుపునిండిరది కాని, నేడేమగునో ? అనుకున్న డాగీకి గ్రహాలు నిన్న ఉన్నచోటునుంచి ‘జంపై’ పోయినవని తెలియడానికి ఎక్కువ టైం పట్టలేదు.
రోడ్డు మరో చివరనుంచి జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. వస్తున్న జనం ఊరికే ఉరికిరావడం లేదు అరుపులు అరుస్తున్నారు. అరుస్తున్న అరుపుల వెనుక ఒపెన్ టాప్ జీపు వస్తున్నది. దాని అడుగులో అడుగువేస్తున్నవి కార్ల బార్లు. ఇక ఈ రోజుకు పస్తే. ఈ ఊరేగింపు షాపు దాటిపోడానికి ఎంత టైం పట్టునో, షాపువాడు క్లోజ్ చేసిపోవుటో జరిగిపోవును అనుకుని నిరాశపడుతూ జనం తొక్కి చంపినా చంపేస్తారని, భయపడుతూ దూరంగా పరుగెత్తి ఓ కరెంటు స్తంభం పక్కన నక్కింది డాగీ. జీపులో నిలబడ్డ మనిషి ముఖం సరిగ్గా కనిపించలేదు. శరీరం కూడా తెలియడంలేదు. ఎన్ని పూలదండలో ఒకదానిమీద ఒకటి ఎక్కి తొక్కుకుంటున్నవి. ఆ దండల వెనక ముఖం ఎవరిదో పోల్చుకోలేకపోయింది డాగీ. అసలిప్పుడు ఈ ఊరేగింపు దేనికి? ఎన్నికలు ఇంకా జరగనేలేదే. నామినేషన్ల టైమూ కాదే మరి ‘పద్మ’ బిరుదేమైనా వచ్చినవాడా అనుకుంటున్న డాగీకి టిఫిన్ సెంటర్ ముందు ‘టీ’ తాగుతూ నిలబడ్డ ఇద్దరి సంభాషణ ద్వారా కొంత ‘క్లారిటీ’ వచ్చింది.
స్కాములో ఇరుక్కున్న ఓ రాజకీయ నాయకుడికి ‘బెయిలు’ రావడంతో జైల్లో ‘చిప్ప’ లాగేసుకుని ఇంటికి పొమ్మన్నార్ట. జైలు నుంచి విడుదల అయిన తమ నాయకుడ్ని జయ జయ ధ్వానాలతో ‘పార్టీ’ అఫీసుకు తీసుకుపోతున్నారట. కార్యకర్తల ఈ ‘ఉత్సాహం ఊరేగింపు సంబరం’ తన నాయకుడు ‘జైలు’ నుంచి ‘బెయిలు’పై బైటకు రావడమేనట. ఇక ఈ ఊరేగింపు ఎక్కడ్నించి ఎక్కడిదాకా, ఎప్పట్నించి ఎప్పటిదాక కొనసాగుతుందో ఇక ఈ రోజుకి వెజిటేరియన్ ఫుడ్డేగతి, అదీ ఏ అమ్మయినా ఇంటి ముందు చద్దన్నం పడేస్తే అనుకుంటూ ఇంటిదారి పట్టింది డాగీ.అరుగు ఎక్కుతుంటే అడిగింది డాంకీ ఏమిటి తంబీ ఇవ్వాళ తొందరగా వచ్చేశావు అని ‘రెగ్యులర్ మీల్స్’ దొరకలేదు. రికామీగా తిరిగే ఓపికలేదు. దొరికిన పచ్చడి మెతుకులు తిని వస్తున్నా అంది డాగీ నీరసంగా. అదేమిటి గుళ్లో ప్రతిష్ట అయిపోయింది. రిపబ్లిక్ డే కూడా గడిచేసింది. ఇంకా షాపు తెరవలేదా అంది డాంకీ. తెరిచాడు భాయ్! కానీ నిన్న ఉన్న చోటినుంచి, గ్రహాలు కదిలినట్లున్నాయి. ఓ పక్షి జైలు నుంచి బైటకు వచ్చాట్ట ఆ ఊరేగింపు మా ‘పొట్ట’ కొట్టింది. దిక్కూ దివాణాలేని కుక్కలం కదా అంటూ కూలబడిరది డాగీ.
ఓ ‘ఆ ఊరేగింపా దేశనాయకులు జైలుకు వెళ్లివస్తుంటే పార్టీ కాక్యకర్తలు ఆ మాత్రం దేశభక్తి చూపాల్సిందే. దేశ నాయకులు, దేశభక్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిరాగ్గా అంది డాగీ. దేశ స్వాతంత్య్రం కోసం మహా నాయలకులంతా జైలుకు వెళ్లిరాలేదు అంది డాంకీ. అంది దేశస్వాతంత్య్రకోసం కానీ ఇప్పుడు మన లీడర్లంతా జైలు ఊచలు లెక్కపెట్టి రావడానికి వెళ్తున్నది స్కాముల్లో కుంభకోణాల్లో ఇరుక్కుని కదూ. అలాగనకు పవిత్రభారత భూమిలో నాయకులకు గిట్టని వాళ్లను కేసుల్లో ఇరకించి జైలుగాలి పీల్చేట్టు చేస్తున్నారేమో అంది డాంకీ. అయితే నువ్వనేదేమిటి మన నాయకులంతా అదే జైలుకువెళ్లి బెయిలు మీద వచ్చిన వాళ్లంతా నేరస్థులు కారంటావా? నిరపరాధులేనంటావా? అంది డాగీ కోపంగా. పేదవాని కోపమేకాదు నీదీ నాదీ కూడా’’ పెదవికి చేటు. ఈ దేశంలో రాజీయనాయకులది ముఖ్యంగా పదవిలో ఉన్నవారిది ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైన జాతి. వీరిలో అనేకులు ఘనమైన నేర చరిత్ర కలిగిన వారే. వీరి బెయిల్ రద్దు పిటిషన్లు ఓ కొలిక్కి రానేరావు. డిశ్చార్జి పిటిషన్ల జాడే ఉండదు. జైలుకు వెళ్లి వచ్చిన వారూ నేరస్థులు కానేకాదని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు కదా. వేరే ఉద్యోగాల మాటేమోకాని నేరాలు చేయడం, జైలుకు వెళ్లి రావడం ‘అడిషనల్ క్వాలిఫికేషన్’ అయింది. రాజకీయ ఉద్యోగులకు అంది డాంకీ.
అవునవును ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే చాలు ఉద్యోగాలు ఊడుతాయి. ఏదైనా కేసులో ఇరుక్కుంటే నిరుద్యోగులిక జీవితాంతం ఉద్యోగానికి పనికిరారు. మన దేశాన్ని చాలామంది జైలుకెళ్లి వచ్చిన పక్షులే ఏలుతున్నవి లేదా జైలుకు వెళ్లాల్సిన నేరాలు చేసిన పక్షులే ఏలుతున్నవి అన్నాడబ్బాయి అరుగు ఎక్కుతూ. వీరి విషయంలో అసలు అరెస్టు చెయ్యాలో వద్దో ఓ చిక్కు ప్రశ్న. కేసులు కొలిక్కి తెద్దామంటే నాకేం తెలియదని కేంద్రం, మాకూ ఏమీ తెలియదని పరిశోధనా సంస్థలు, తీరికలేదని అసలైనవారు దాటేస్తుండడంతో కోర్టులు కూడా అర్థంకాని ప్రశ్నలకు సమాధానం వెదుక్కోలేకపోతున్నాయి అంది డాంకీ. భవిష్యత్తు అవసరాల కోసం కేసుల్నిలా నానబెడ్తారన్నమాట. పాపం ప్రజలు ఒక జైలు పక్షిని కాకపోతే మరో జైలు పక్షినే ఎన్నుకోవాలి మరి అంది డాగీ.