మెదడులో, శరీరంలో చిప్‌లు అమర్చడం మనం కొన్ని సినిమాల్లో చూసి ఉంటాం. అయితే అవి నిజ జీవితంలో కూడా త్వరలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించిన న్యూరాలింగ్.. తాజాగా ఓ వ్యక్తి మెదడులో సక్సెస్‌ఫుల్‌గా చిప్‌ను అమర్చింది. అయితే ఆ చిప్ అమర్చిన వ్యక్తి.. ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని న్యూరాలింక్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. దీంతో మనుషుల మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో కీలక ముందుడుగు పడినట్లు అయింది. తొలిసారి ఓ వ్యక్తి మెదడుకు విజయవంతంగా వైర్లెస్ చిప్‌ను అమర్చామని న్యూరాలింక్ ఫౌండర్ ఎలాన్ మస్క్ మంగళవారం వెల్లడించారు. ఆ వ్యక్తికి సోమవారం ఆపరేషన్ నిర్వహించి.. సక్సెస్‌ఫుల్‌గా చిప్‌ను అమర్చామని.. ప్రస్తుతం ఆ వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.