ప్రతిభా పురస్కారం అందుకున్న స్థానిక వైద్యాధికారిని ఇందిరా ప్రియాంక
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ వైద్య సేవలు అందించిన స్థానిక ఆసుపత్రి వైద్యురాలు ఇందిర ప్రియాంక ఎంపికయ్యారు. ఆమెకు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ల చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సబ్ కలెక్టర్ దాత్రి రెడ్డి, చింతపల్లి ఏఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తదితరులు ఉన్నారు.