Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు : జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అర్హత ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు.
బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేస్తున్న హౌస్ సైట్స్ కు సంబంధించి జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రి దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 535 లో ఉన్న అన్ని నిబంధనలను పాటించి అర్హత ఉన్న జర్నలిస్టులకు హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అర్హత ఉన్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్స్, వెటరన్ పాత్రికేయులకు ప్రభుత్వ ఉత్తర్వులలో పొందుపరిచిన అర్హతలు, నిబంధనల ప్రకారం దరఖాస్తులు పూర్తి చేసిన వారికి హౌస్ సైట్స్ కేటాయిస్తామన్నారు. 5 సంవత్సరాల అక్రిడేషన్ అనుభవం కల్గిన వారిని కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ వారు గుర్తించి పంపిన ప్రాథమిక జాబితాను పరిశీలించిన అనంతరం తుది జాబితా మేరకు ఇంటి స్థలాలివ్వడం జరుగుతుందన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, విజయవాడ వారి కార్యాలయం నుంచి ప్రాథమిక వెరిఫికేషన్ జరిగి జిల్లాకు 335 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. జిల్లాకు వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత జాబితాను ఆయా మండలాల తహసిల్దార్ లకు పంపించి పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అర్హత ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించేందుకోసం అవసరమైన స్థలాన్ని సేకరించాలని ఆర్డీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి మీడియా జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ సభ్యులు జి.రామచంద్రారెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం 20 ఏళ్ల తర్వాత వచ్చిందని, అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలని కోరారు. అనర్హత కలిగిన సభ్యులకు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. వరుసగా ఐదేళ్లు అక్రిడిటేషన్ ఉండి ఏదైనా కారణం చేత ఈ ఏడాది అక్రిడిటేషన్ రాకపోతే వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు ఆర్.భోగేశ్వర్ రెడ్డి, పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రాకముందే ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రిడిటేషన్ ఉన్నవారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
ఈ సమావేశంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, ఆర్డీఓలు జి.వెంకటేష్, రాణి సుస్మిత, గుంతకల్ ఆర్డీవో కార్యాలయం డిఏఓ భూషణం, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ, పీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img