విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని వివిధ పాఠశాలలో ఉపాద్యాయునిగా సుదీర్ఘకాలం సేవలు అందించి నేడుపదవీ విరమణ చేసిన కురమాన విజయ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అలజింగి జోగారావు తెలిపారు.బుదవారంనాడు సీతానగరంలో జరిగిన పదవీవిరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజయ్ ను దుస్సాలువతో సన్మానించారు.ఈకార్యక్రమంలో ఎంపిపి ప్రతినిది బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పటిసి బాబ్జి, ఎంపిడిఓ ప్రసాద్,మండల విద్యాశాఖాధికారులు సూరిదేముడు, వెంకటరమణ, స్కూలు కాంప్లెక్స్ చైర్మన్ ఇల్లా ప్రసన్న లక్ష్మి, ఎస్ ఎం సి ఛైర్మెన్ లక్ష్మి,ఉపాద్యాయ సంఘాల నాయకులు కురమాన జోగారావు, గౌరునాయుడు,మోహనరావు, ఈశ్వర రావు, శ్రీనివాసరావు, హెచ్ ఎం సుమతి, చినభోగిలిసర్పంచ్ కురమాన రాధ శ్రీనివాసరావు,మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిదులు,నాయకులు ,ఉపాధ్యాయ సిబ్బంది, ఎమ్మార్సి సిబ్బంది,విధ్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.