Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మాతృ, శిశు మరణాలు జరగరాదు : జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా నియంత్రించేందుకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన మాతృ, శిశు మరణాలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జూలై నుంచి సెప్టెంబర్ నెలవరకు జిల్లాలో 3 మాతృ మరణాలు, 3 శిశు మరణాలు సంభవించాయన్నారు. మరణాలకు సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది అనే ప్రతి అంశాన్ని పరిశీలించాలని, ఏ స్థాయిలో అయినా నిర్లక్ష్యం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాతృ, శిశు మరణాలకు సంభవించకుండా చూడాలని, జీవితాలు కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరణాలపై ఎవరి పాత్ర ఎంత ఉంది, నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అనేది మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలతో జరిగే ప్రతి సమావేశాల్లోనూ తెలియజేయాలన్నారు. మరణాలు జరగకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, మెడికల్ అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. సిహెచ్సి, పిహెచ్ఈ లలో సమావేశం నిర్వహించినప్పుడు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మరణాలపై ప్రతి ఒక్క కేసును పూర్తిగా విచారణ చేయడం జరిగింది. మరణాలపై పరిశీలన చేసి నివేదిక అందించాలన్నారు.
ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఐఓ యుగంధర్, ఎఫ్.పి.సి నోడల్ ఆఫీసర్ డా.సుజాత, జిల్లా లెప్రసి అండ్ టీబీ ఆఫీసర్ డా.అనుపమ, ఆర్.బి.ఎస్.కె నోడల్ ఆఫీసర్ డా.నారాయణ స్వామి, అనస్తీసియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి డా.ఎ. నవీన్ కుమార్, గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడి డా.శంషాద్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శంకర్ నారాయణ, బత్తలపల్లి ఆర్డిటి గైనిక్ డిపార్ట్మెంట్ హెడ్ డా.షాను, కిమ్స్ సవేరా ఓబిజీ కన్సల్టెంట్ గీతా రాణి, మెడికల్ అధికారులు, ఏఎన్ఎమ్ లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img