విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని జోగోని కుంట పార్థసారథి నగర్ లో ఈనెల16,17,18వ తేదీ లలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతలయ్య స్వామి వార్ల పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 16న గణపతి హోమం కలశ స్థాపన 15 17 వ తేదీ రుద్ర సహిత దుర్గాదేవి, చండీ హోమాలు, 18వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో అర్చకుల నడుమ వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహిస్తామని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు.